బాబోయ్... నేనాడలేను | England in Australia 2013-14 Trott returns home due to stress-related illness | Sakshi
Sakshi News home page

బాబోయ్... నేనాడలేను

Published Tue, Nov 26 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

బాబోయ్... నేనాడలేను

బాబోయ్... నేనాడలేను

సిడ్నీ:  యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. తీవ్ర ఒత్తిడి కారణంగా తిరిగి స్వదేశానికి వెళుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ‘క్రికెట్ నుంచి ట్రాట్ కొంత విరామం తీసుకుంటున్నాడు. అయితే ఇది ఎంతకాలమనేది చెప్పలేం. దీని గురించి పూర్తి విషయాలు అతను వెల్లడించలేదు. ప్రస్తుతం అతను ఉన్న స్థితిలో ఆట ఆడలేడు. కాబట్టి మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండడు’ అని ఈసీబీ వెల్లడించింది. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న తాను ఇక కోలుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రాట్ తెలిపాడు. 2006-07లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్ కూడా ఇలాగే ఒత్తిడి వల్ల కొన్నాళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. నిరాశలో ఉన్న ట్రాట్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ట్రెస్కోథిక్ ట్వీట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement