న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన హుందాతనం చాటేందుకు చేసిన వ్యాఖ్యలకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చురకలతో సమాధానమిచ్చాడు. యాషెస్ రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. క్రీజులో ఉన్న స్మిత్‌ను అతని బౌన్సర్లు రెండు సార్లు బలంగా గాయపరిచాయి. దీనిపై షోయబ్ మాట్లాడుతూ ‘బౌన్సర్లు ఆటలో భాగమే. కానీ అదే బౌన్సర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బలంగా తాకితే... ఏమైనా గాయమైందో లేదో అతన్ని చూడాలి. కానీ ఆర్చర్ మాత్రం కనీస విజ్ఞత లేకుండా తన మానాన తను వెళ్లిపోవడం ఏం బాగోలేదు’ అని ఇంగ్లండ్ పేసర్‌ను తప్పుబట్టాడు.
దీనిపై యువరాజ్ స్పందిస్తూ ‘నిజమే అక్తర్... నువ్వయితే అలా తడిమి చూసేవాడివి. కానీ అప్పుడక్కడ నీ మాటలెలా ఉంటాయంటే... అయ్యో పాపం దెబ్బతగిలిందా అన్నట్లు కాకుండా కాస్కో మళ్లీ వేస్తా అన్నట్లు ఉంటాయి’ అని దెప్పిపొడిచాడు. రెండో టెస్టులో ఆర్చర్ దెబ్బకు స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలోనే కొత్తగా చేర్చిన నిబంధన వల్ల సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా లబ్‌షేన్ వచ్చి టెస్టులో ఆసీస్‌ను ఓడిపోకుండా కాపాడాడు. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment