ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్‌లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్ వేదికగా జూన్ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి.
తాజాగా గురువారం నాటింగ్‌హమ్ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్, ఇంగ్లండ్ వుమెన్స్ మధ్య యాషెస్ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ 39 పరుగులు, అలానా కింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్‌గ్రాత్ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు, లారెన్ ఫైలర్ రెండు వికెట్లు పడగొట్టింది.
కాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, వుమెన్ క్రికెటర్ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్‌లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్ చేయాలని భావించిన మిచెల్ స్టార్క్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్‌లో అలీసా హేలీ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
Mitchell Starc is here of course, waiting in an already crowded queue to get into Trent Bridge for the opening day of the #WAshes Test with Alyssa Healy captaining for the first time pic.twitter.com/wf6g7hUuut
— Bharat Sundaresan (@beastieboy07) June 22, 2023
Comments
Please login to add a commentAdd a comment