Nottingham Test
-
భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్ వేదికగా జూన్ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి. తాజాగా గురువారం నాటింగ్హమ్ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్, ఇంగ్లండ్ వుమెన్స్ మధ్య యాషెస్ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ 39 పరుగులు, అలానా కింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్‌గ్రాత్ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు, లారెన్ ఫైలర్ రెండు వికెట్లు పడగొట్టింది. కాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, వుమెన్ క్రికెటర్ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్ చేయాలని భావించిన మిచెల్ స్టార్క్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్‌లో అలీసా హేలీ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. Mitchell Starc is here of course, waiting in an already crowded queue to get into Trent Bridge for the opening day of the #WAshes Test with Alyssa Healy captaining for the first time pic.twitter.com/wf6g7hUuut — Bharat Sundaresan (@beastieboy07) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్ -
లండన్ చేరిన భారత జట్టు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్‌గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్‌హామ్ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్‌లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్ ఈ నెల 13న ముగియనుంది. గంగూలీ...లార్డ్స్ టెస్టు చూసేందుకు! బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడు. భారత్‌ను తాజాగా ‘రెడ్’ లిస్ట్ నుంచి ‘అంబర్’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
Ind vs Eng: ఇక టెస్టు క్రికెట్ సమయం
నాటింగ్‌హామ్: భారత ద్వితీయ శ్రేణి జట్టు ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడినా స్టార్లు లేని ఆ జట్టు మ్యాచ్‌లు సగటు క్రికెట్ అభిమానులకు పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కీలక మ్యాచ్ కోసం బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కేఎల్ రాహుల్‌కు చాన్స్... కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన లైనప్‌ను చూస్తే తొలి టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గాయపడిన శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో ఆడిన 36 టెస్టుల్లో 5 సార్లు మినహా అన్ని సందర్భాల్లో రాహుల్ స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. తాజా ఫామ్‌ను పరిగణనలోకి తీసు కున్నా రాహుల్‌కే తొలి అవకాశం ఉంటుంది. రోహి త్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది. ముగ్గురు పేసర్లు బుమ్రా, ఇషాంత్, షమీలతో పాటు అశ్విన్ ఖాయం కాగా... జడేజాను కాకుండా నాలు గో పేసర్‌గా శార్దుల్‌ను తీసుకుంటారా చూడాలి. స్యామ్ కరన్ కీలకం... ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్ స్టోక్స్‌లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. పిచ్, వాతావరణం ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా/శార్దుల్, షమీ, ఇషాంత్, బుమ్రా. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, స్యామ్ కరన్, రాబిన్సన్, బ్రాడ్, లీచ్, అండర్సన్. -
నాటింగ్‌హామ్ టెస్టు : ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం
నాటింగ్‌హామ్ : భారత్ - ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు 307 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన భారత్ మరో 22 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను ఇంగ్లండ్‌కు అప్పగించేసింది. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపట్లోనే టీమిండియా రిషబ్‌పంత్ (24) రవిచంద్రన్ అశ్విన్ (14), మహ్మద్ షమీ (3). జస్ర్పీత్ బుమ్రా (0) వికెట్లను కోల్పోయింది. కాగా, 329 పరుగులు చేసిన టీమిండియా ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు 2014లో భారత్ ఇంగ్లండ్‌పై 295 పరుగులు చేసింది. మూడో టెస్టు అప్డేట్స్... భారత బౌలర్ల సమష్టి కృషితో ఇంగ్లండ్ 161 పరుగులకే తోక ముడిచింది. దీంతో భారత్‌కు 168 పరుగుల భారీ ఆదిక్యం లభించింది. ఇంగ్లండ్ 38.2 ఓవర్లకు ఆలౌట్ అయింది. పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా, ఇషాంత్, బుమ్రా తలో రెండు వికెట్లు, షమీ 1 వికెట్ తీశారు. చివరి వికెట్‌గా బట్లర్ (39) వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ ఆలౌట్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. 32 ఓవర్లో అదిల్ రషీద్, బ్రాడ్ వికెట్లు తీసిన పాండ్యా మొత్తం 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 152 పరుగులకు 9 వికెట్లు. టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 108 వద్ద స్టోక్స్, 110 వద్ద బెయిర్ స్టో, 118 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 31 ఓవర్లకు 118/7 గా ఉంది. 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. స్టోక్స్‌ను షమీ ఔట్ చేయగా.. బెయిర్ స్టో, వోక్స్ వికెట్లను పాండ్యా తీశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు. 25 ఓవర్లో బంతిని అందుకున్న పాండ్యా తన తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేశాడు. పాండ్యా ఔట్ స్వింగర్ ఆడబోయిన రూట్ స్లిప్‌లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే, బంతి నేలను తాకినట్లు కనిపించడంతో అంపైర్ థర్డ్ అంపైర్ సలహా కోరగా.. ఔట్ అనే రిప్లై వచ్చింది. 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 92/4 గా ఉంది. ఇషాంత్, బుమ్రా చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చెరో వికెట్ తీసిన ఈ ద్వయం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆటను కట్టడి చేస్తోంది. జట్టు స్కోరు 75 పరుగుల వద్ద ఓలి పోప్ (10)ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఫైన్ ఆఫ్‌లో ఓలి ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పంత్ చక్కని డైవ్ చేసి అందుకున్నాడు. 20 ఓవర్లు మగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 75/3 గా ఉంది. మూడు క్యాచ్‌లు పంత్ పట్టడం విశేషం. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన ఆరంభమే ఇంగ్లండ్‌కు కూడా దొరికింది. ఓపెనర్లు అలెస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్ 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 54 వద్ద తొలి వికెట్‌గా కుక్ (29) వెనుదిరిగాడు. రెండో వికెట్‌గా జెన్నింగ్స్ (20) జట్టు స్కోరు 59 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ఇద్దరూ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం విశేషం. ఇంగ్లండ్ స్కోరు 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 59/2 గా ఉంది. -
నాటింగ్‌హామ్ టెస్ట్‌లో రిషబ్‌పంత్ అరంగ్రేటం
-
నాటింగ్‌హామ్ టెస్టు : కోహ్లి సెంచరీ మిస్
నాటింగ్‌హామ్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆతిద్యజట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా జట్టులో మూడు కీలక మార్పులు చేసింది. దినేష్‌కార్తిక్ స్థానంలో రిషబ్‌పంత్, కుల్దీప్యాదవ్ స్థానంలో బుమ్రా, మరళీవిజయ్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చారు. కాగా, ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించి మంచి ప్రతిభ కనబరిచిన రిషబ్‌పంత్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 290 మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడగా.. రిషభ్ స్థానం 291 కావడం విశేషం. మ్యాచ్ అప్డేట్స్ ఇవి.. మూడో టెస్టులో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. 97 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లిని అదిల్ రషీద్ తన స్పిన్‌తో బురిడీ కొట్టించాడు. అదిల్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి స్లిప్‌లో బెన్‌స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. 77 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 279/5 గా ఉంది. హార్దిక్ పాండ్యా 12, రిషబ్‌పంత్ క్రీజులో (0) ఉన్నారు. టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కీలక ఇన్నింగ్స్ నిర్మించడంలో కోహ్లికి జతకలిసిన రహానే 81 (12 ఫోర్లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో టిమ్ కుక్కు క్యాచ్ పట్టడంతో రహానే పెవిలియన్ చేరాడు. కాగా, మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నకెప్టెన్ కోహ్లి 90 (11 ఫోర్లు) పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. 72 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 268/4 గా ఉంది. కోహ్లి 90, హార్దిక్ పాండ్యా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియాను ఆదుకున్న కోహ్లి, రహానేలు నిలకడ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టిన క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతున్నారు. ఇప్పటికే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ ద్వయం.. భారత్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడుతోంది. 60 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 206/3 గా ఉంది. కోహ్లి 58 (7 ఫోర్లు), రహానే 63 (10 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానేలు తమదైన ఆటతీరుతో ఆదుకున్నారు. వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపేందుకు పూనుకున్నారు. 53 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 182/3 గా ఉంది. కోహ్లి 51, రహానే 50 పరుగులతో క్రీజలో ఉన్నారు. లంచ్ విరామం సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానేలు నిలకడగా ఆడుతూ పరుగులు జోడిస్తున్నారు. 43 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 మూడు వికెట్లకు భారత్ 155 పరుగుల వద్ద నిలిచింది. విరాట్ కోహ్లీ 38, అజింక్యా రహానే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ భారత్ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిని భుజాన వేసుకున్నారు. కీలకమైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతోంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌కు తాళలేక టపటపా వికెట్లు కోల్పోయింది. బంతితో నిప్పులు చెరిగిన వోక్స్ వరుసగా మూడు వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడింది. 35 పరుగులు చేసి శిఖర్ ధావన్ వోక్స్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే లోకేశ్ రాహుల్ (23 పరుగులు), ఛటేశ్వర పూజారా (14 పరుగులు) సైతం పెవిలియన్ బాట పట్టారు. 60 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 65 పరుగుల వద్ద రెండో వికెట్, 82 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్‌కు కొద్దిముందే భారత్ మూడు వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లి నాలుగు పరుగులతో ఉండగా.. రహానే బ్యాటింగ్‌కు రానున్నాడు. 18.4 ఓవర్ వద్ద 60 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన భారత్. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ధావన్ ఔట్. 35 పరుగులు చేసి వెనుదిరిగిన ధావన్.. 21 ఓవర్లలో భారత్ స్కోరు 65/1.. పూజారా 5, రాహుల్ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిలకడగా ఆడుతోంది. తాడో-పెడో తేల్చుకోవాల్సిన ఈ టెస్టులో ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ 19 పరుగులతో, శిఖర్ ధావన్ 35 పరుగులతో ఉన్నారు. 17.2 ఓవర్లలో 56 పరుగులు చేసింది. -
రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో కోత
లండన్: ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తో గొడవ పడిన వివాదంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దోషిగా తేలాడు. అతడిని అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్‌హామ్ లో జరిగిన మొదటి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడ్డారు. ఆండర్సన్ తో వివాదంలో జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది. జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ విచారణ ఆగస్ట్ 1న జరగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటు న్న అండర్సన్‌ను..1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు.