రవీంద్ర జడేజా మ్యాచ్ ఫీజులో కోత
లండన్: ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తో గొడవ పడిన వివాదంలో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దోషిగా తేలాడు. అతడిని అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్హామ్ లో జరిగిన మొదటి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడ్డారు. ఆండర్సన్ తో వివాదంలో జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది.
జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ విచారణ ఆగస్ట్ 1న జరగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటు న్న అండర్సన్‌ను..1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు.