భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. శుభ్‌మన్ గిల్ స్థానంలో (వన్‌డౌన్‌లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.
జడేజాకు నో ప్లేస్
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్‌మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్‌ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment