నాటింగ్‌హామ్ : భారత్ - ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు 307 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన భారత్ మరో 22 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను ఇంగ్లండ్‌కు అప్పగించేసింది. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపట్లోనే టీమిండియా రిషబ్‌పంత్ (24) రవిచంద్రన్ అశ్విన్ (14), మహ్మద్ షమీ (3). జస్ర్పీత్ బుమ్రా (0) వికెట్లను కోల్పోయింది. కాగా, 329 పరుగులు చేసిన టీమిండియా ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు 2014లో భారత్ ఇంగ్లండ్‌పై 295 పరుగులు చేసింది.
మూడో టెస్టు అప్‌డేట్స్...
- భారత బౌలర్ల సమష్టి కృషితో ఇంగ్లండ్ 161 పరుగులకే తోక ముడిచింది. దీంతో భారత్‌కు 168 పరుగుల భారీ ఆదిక్యం లభించింది. ఇంగ్లండ్ 38.2 ఓవర్లకు ఆలౌట్ అయింది. పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా, ఇషాంత్, బుమ్రా తలో రెండు వికెట్లు, షమీ 1 వికెట్ తీశారు. చివరి వికెట్‌గా బట్లర్ (39) వెనుదిరిగాడు.
- హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ ఆలౌట్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. 32 ఓవర్లో అదిల్ రషీద్, బ్రాడ్ వికెట్లు తీసిన పాండ్యా మొత్తం 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 36 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 152 పరుగులకు 9 వికెట్లు.
- టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 108 వద్ద స్టోక్స్, 110 వద్ద బెయిర్ స్టో, 118 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 31 ఓవర్లకు 118/7 గా ఉంది. 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. స్టోక్స్‌ను షమీ ఔట్ చేయగా.. బెయిర్ స్టో, వోక్స్ వికెట్లను పాండ్యా తీశాడు.
- హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు. 25 ఓవర్లో బంతిని అందుకున్న పాండ్యా తన తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేశాడు. పాండ్యా ఔట్ స్వింగర్ ఆడబోయిన రూట్ స్లిప్‌లో రాహుల్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే, బంతి నేలను తాకినట్లు కనిపించడంతో అంపైర్ థర్డ్ అంపైర్ సలహా కోరగా.. ఔట్ అనే రిప్లై వచ్చింది. 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 92/4 గా ఉంది.
- ఇషాంత్, బుమ్రా చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చెరో వికెట్ తీసిన ఈ ద్వయం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆటను కట్టడి చేస్తోంది. జట్టు స్కోరు 75 పరుగుల వద్ద ఓలి పోప్ (10)ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఫైన్ ఆఫ్‌లో ఓలి ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పంత్ చక్కని డైవ్ చేసి అందుకున్నాడు. 20 ఓవర్లు మగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 75/3 గా ఉంది. మూడు క్యాచ్‌లు పంత్ పట్టడం విశేషం.
- మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన ఆరంభమే ఇంగ్లండ్‌కు కూడా దొరికింది. ఓపెనర్లు అలెస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్ 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 54 వద్ద తొలి వికెట్‌గా కుక్ (29) వెనుదిరిగాడు. రెండో వికెట్‌గా జెన్నింగ్స్ (20) జట్టు స్కోరు 59 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ఇద్దరూ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం విశేషం. ఇంగ్లండ్ స్కోరు 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 59/2 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment