నాటింగ్‌హామ్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆతిద్యజట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత రెండు టెస్టుల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా జట్టులో మూడు కీలక మార్పులు చేసింది. దినేష్‌కార్తిక్ స్థానంలో రిషబ్‌పంత్, కుల్దీప్‌యాదవ్ స్థానంలో బుమ్రా, మరళీవిజయ్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చారు. కాగా, ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించి మంచి ప్రతిభ కనబరిచిన రిషబ్‌పంత్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 290 మంది ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడగా.. రిషభ్ స్థానం 291 కావడం విశేషం. మ్యాచ్ అప్‌డేట్స్ ఇవి..
- మూడో టెస్టులో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. 97 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లిని అదిల్ రషీద్ తన స్పిన్‌తో బురిడీ కొట్టించాడు. అదిల్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి స్లిప్‌లో బెన్‌స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. 77 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 279/5 గా ఉంది. హార్దిక్ పాండ్యా 12, రిషబ్‌పంత్ క్రీజులో (0) ఉన్నారు.
- టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కీలక ఇన్నింగ్స్ నిర్మించడంలో కోహ్లికి జతకలిసిన రహానే 81 (12 ఫోర్లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో టిమ్ కుక్‌కు క్యాచ్ పట్టడంతో రహానే పెవిలియన్ చేరాడు. కాగా, మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నకెప్టెన్ కోహ్లి 90 (11 ఫోర్లు) పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. 72 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 268/4 గా ఉంది. కోహ్లి 90, హార్దిక్ పాండ్యా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- టీమిండియాను ఆదుకున్న కోహ్లి, రహానేలు నిలకడ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టిన క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతున్నారు. ఇప్పటికే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ ద్వయం.. భారత్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడుతోంది. 60 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 206/3 గా ఉంది. కోహ్లి 58 (7 ఫోర్లు), రహానే 63 (10 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు.
- 82 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానేలు తమదైన ఆటతీరుతో ఆదుకున్నారు. వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపేందుకు పూనుకున్నారు. 53 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 182/3 గా ఉంది. కోహ్లి 51, రహానే 50 పరుగులతో క్రీజలో ఉన్నారు.
- లంచ్ విరామం సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానేలు నిలకడగా ఆడుతూ పరుగులు జోడిస్తున్నారు. 43 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 మూడు వికెట్లకు భారత్ 155 పరుగుల వద్ద నిలిచింది. విరాట్ కోహ్లీ 38, అజింక్యా రహానే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ భారత్ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిని భుజాన వేసుకున్నారు.
- కీలకమైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతోంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌కు తాళలేక టపటపా వికెట్లు కోల్పోయింది. బంతితో నిప్పులు చెరిగిన వోక్స్ వరుసగా మూడు వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడింది.
35 పరుగులు చేసి శిఖర్ ధావన్ వోక్స్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే లోకేశ్ రాహుల్ (23 పరుగులు), ఛటేశ్వర పూజారా (14 పరుగులు) సైతం పెవిలియన్ బాట పట్టారు. 60 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 65 పరుగుల వద్ద రెండో వికెట్, 82 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్‌కు కొద్దిముందే భారత్ మూడు వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లి నాలుగు పరుగులతో ఉండగా.. రహానే బ్యాటింగ్‌కు రానున్నాడు.
- 18.4 ఓవర్ వద్ద 60 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన భారత్. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ధావన్ ఔట్. 35 పరుగులు చేసి వెనుదిరిగిన ధావన్.. 21 ఓవర్లలో భారత్ స్కోరు 65/1.. పూజారా 5, రాహుల్ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిలకడగా ఆడుతోంది. తాడో-పెడో తేల్చుకోవాల్సిన ఈ టెస్టులో ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్ 19 పరుగులతో, శిఖర్ ధావన్ 35 పరుగులతో ఉన్నారు. 17.2 ఓవర్లలో 56 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment