![IND vs ENG 2nd ODI: Varun Chakravarthy to debut, Virat Kohli back](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/virat_varun1.jpg.webp?itok=TeyzOp2I)
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.
తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్‌లకు ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.
తుది జట్లు
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment