![Steve Smith Creates History, Becomes First Player In The World](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/steve.jpg.webp?itok=kSDYR0O8)
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) పరుగులు వరద పారిస్తున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టు సూపర్ సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో టెస్టులోనూ తన బ్యాట్‌కు పనిచెప్పాడు.
ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్మిత్ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. 254 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 131 పరుగులు చేశాడు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్మిత్ అలెక్స్ క్యారీతో కలిసి నాలుగో వికెట్‌కు 259 పరుగులు జోడించాడు.
తద్వారా ఓ అరుదైన స్మిత్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 11 మంది ఆటగాళ్లతో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ టెస్టుల్లో 10 మంది ఆటగాళ్లతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాజా మ్యాచ్‌తో రికీ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.
చరిత్ర సృష్టించిన అలెక్స్-స్మిత్..
అదే విధంగా ఈ మ్యాచ్‌లో అభేధ్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ జోడీ సైతం ఓ అరుదైన ఫీట్‌ను తమ పేరిట లిఖించుకున్నారు. శ్రీలంక గడ్డపై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పర్యాటక జట్టు జోడీ వీరిద్దరూ నిలిచారు.
గతంలో ఈ రికార్డు మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2011లో పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో హస్సీ-షాన్ మార్ష్ 258 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో దిగ్గజ క్రికెటర్ల రికార్డును స్మిత్-అలెక్స్ జోడీ బ్రేక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment