ఇంగ్లండ్‌తో రెండో వ‌న్డే.. భార‌త జట్టులో కీల‌క మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ? | IND vs ENG: Indias Predicted XI for 2nd ODI | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో వ‌న్డే.. భార‌త జట్టులో కీల‌క మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?

Published Sun, Feb 9 2025 10:29 AM | Last Updated on Sun, Feb 9 2025 11:09 AM

IND vs ENG: Indias Predicted XI for 2nd ODI

క‌ట‌క్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో రెండో వ‌న్డేలో త‌ల‌ప‌డేందుకు టీమిండియా సిద్ద‌మైంది. తొలి వ‌న్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌లే గెలిచి మరో 25 మ్యాచ్‌ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కింగ్‌​ ఇన్‌.. జైశ్వాల్ ఔట్‌!
మోకాలి గాయం కార‌ణంగా తొలి వ‌న్డేకు దూర‌మైన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వ‌న్డేలో ఆడ‌నున్నాడు. ఈ విష‌యాన్ని భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ సైతం ధ్రువీక‌రించాడు. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క‌ట‌క్ మ్యాచ్‌తో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్‌.. పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కేవ‌లం 13 ప‌రుగులు మాత్రమే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో అత‌డిని ప‌క్క‌న పెట్టి యథావిధిగా గిల్‌ను ఓపెన‌ర్‌గా పంపాల‌ని జ‌ట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో యువ‌పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్‌దీప్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాల‌ని మెనెజ్‌మెంట్ నిర్ణ‌యించందంట‌. దీంతో మ‌రో యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

క‌ట‌క్ వ‌న్డేతో అరంగేట్రం చేసిన హ‌ర్షిత్ రాణా 3 వికెట్లు ప‌డ‌గొట్టి  స‌త్తాచాటాడు. కానీ ప‌రుగులు మాత్రం భారీ స‌మ‌ర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో రిష‌బ్ పంత్‌ను ఆడించాల‌ని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్‌కే ప‌రిమితం కానున్నాడు.

రోహిత్‌ ఫామ్‌లోకి వస్తాడా?
కాగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేలవ ఫామ్‌ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్‌-గవాస్కర్‌​ ట్రోఫీలో విఫలమైన రోహిత్‌.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్‌ ఔటయ్యాడు.

ఈ క్రమంలో రోహిత్‌కు భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్‌పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్‌ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్  ),శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌/ రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీం‍ద్ర జడేజా, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్  ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్‌ డకెట్,  లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్‌.
చదవండి: సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement