మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్‌లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్‌లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్‌సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్‌లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే!
Comments
Please login to add a commentAdd a comment