క్రికెట్‌లో కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. నిజజీవితంలో భార్యభర్తలైన ఇద్దరు క్రికెటర్లు ఒకే జట్టుపై ఒకే సమయంలో(వేర్వేరు ప్రాంతాల్లో) బ్యాటింగ్ దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరే మిచెల్ స్టార్క్, అలిస్సా హేలీ. ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ పాకిస్తాన్ పర్యటనలో ఉండగా.. అలిస్సా హేలీ వన్డే వరల్డ్‌కప్‌లో బిజీగా ఉంది.
ఇక విషయంలోకి వెళితే.. వరల్డ్‌కప్‌లో భాగంగా మౌంట్ మాంగనూయి వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్ పాకిస్తాన్ వుమెన్స్‌తో మ్యాచ్ ఆడింది. ఓపెనర్‌గా అలిస్సా హేలీ దుమ్మురేపింది. 72 పరుగులతో అలిస్సా హేలీ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ విజయంలో భాగం పంచుకుంది. ఇదే సమయంలో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆఖరిరోజు మిచెల్ స్టార్క్ ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంకేముంది అటు భార్య.. ఇటు భర్త విభిన్న పార్శ్వాల్లో ఒకే సమయంలో బ్యాటింగ్ రావడంతో కెమెరాలన్ని క్లిక్‌మనిపించాయి. అలిస్సా హేలీ, మిచెల్ స్టార్క్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇక మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పాకిస్తాన్ వుమెన్స్‌పై ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ 34.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మరోవైపు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పరుగులు తీస్తుంది. ఐదోరోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా 459 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది.
చదవండి: ICC Womens WC 2022: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే
Shaheen Shah strikes 🔥 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ZjINDSGnid
— Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022
Wife and husband are both batting against Pakistan at the same time. That's too cute. 💛💚 @ahealy77 #PAKvAUS #CWC22 pic.twitter.com/ku9bnHCOzf
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 8, 2022
Comments
Please login to add a commentAdd a comment