England Vs Australia Womens Ashes Test Ends In Draw: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు మాత్రమే చేసి, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌ను 337/9 వద్ద డిక్లేర్ చేసింది. లాన్నింగ్స్(93),హేన్స్(86), తహ్లియా మెక్‌గ్రాత్(52), గార్డ్నర్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ 5, సీవర్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం హీథర్(168*) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది.
40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 216/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ప్రత్యర్ధి ముందు 257 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు నతాలీ సీవర్(58), హీధర్ నైట్(48), లారెన్ హిల్(33), టమ్మీ బ్యూమౌంట్(36), సోఫియా డంక్లీ(45) రాణించినప్పటికీ.. ఆసీస్ బౌలర్లు సదర్‌ల్యాండ్(3), అలానా కింగ్(2) ధాటికి ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఫలితంగా ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్
Comments
Please login to add a commentAdd a comment