డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు | Ausis-england Match drawn | Sakshi
Sakshi News home page

డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు

Aug 5 2013 10:00 PM | Updated on Sep 1 2017 9:40 PM

డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు

డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా  ముగిసింది. 332 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆటను కొనసాగిస్తున్న సమయంలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఆట నిలిచి పోయే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 32 పరుగుల చేసింది. చకచకా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కంగుతినిపించాలనుకున్న ఆసీస్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఆట నిలిచే సమయానికి బెల్(1), రూట్(13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

  అంతకుముందు ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement