బీసీసీఐ పిటిషన్ విచారణకు సుప్రీం ఒకే | Supreme Court agrees to hear BCCI's plea against Bombay HC verdict | Sakshi
Sakshi News home page

బీసీసీఐ పిటిషన్ విచారణకు సుప్రీం ఒకే

Published Wed, Aug 7 2013 3:16 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

బీసీసీఐ పిటిషన్ విచారణకు సుప్రీం ఒకే - Sakshi

బీసీసీఐ పిటిషన్ విచారణకు సుప్రీం ఒకే

బాంబే హైకోర్టు తీర్పుపై భారత క్రికెట్ సంఘం(బీసీసీఐ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బీసీసీఐకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తుకు బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిషన్ ఏర్పాటు అనైతికం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్న బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాల బెట్టింగ్ వ్యవహారంపై ఈ కమిషన్ ఏర్పాటైంది.

దీన్ని వ్యతిరేకిస్తూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) కోర్టులో పిల్ దాఖలు చేయగా బీసీసీఐకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement