స్టీవ్ స్మిత్
మాంచెస్టర్: కళ్లెదుట 383 పరుగుల భారీ లక్ష్యం... నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్... భీకరంగా బంతులేస్తున్న ప్రత్యర్థి పేసర్లు... ప్రస్తుతం స్కోరు 18/2..! కమిన్స్ (2/8) నిప్పులు చెరగడంతో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ బర్న్స్ (0)తో పాటు కీలకమైన కెప్టెన్ జో రూట్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. చేతిలో ఉన్న 8 వికెట్లతో ఇంకా 365 పరుగులు చేయాల్సి ఉంది. ఇదీ యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పరిస్థితి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 186/6 వద్ద డిక్లేర్ చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బంతుల్లో 82; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వేడ్ (76 బంతుల్లో 34; 2 ఫోర్లు) సహకరించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కమిన్స్ బెంబేలెత్తించాడు.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడు, నాలుగు బంతులకు బర్న్స్, రూట్‌లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్ వికెట్లను అతడు గిరాటేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 200/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 301 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (3/80) ధాటికి స్టోక్స్ (26), బెయిర్ స్టో (17) త్వరగానే ఔటయ్యారు. బట్లర్ (65 బంతుల్లో 41; 7 ఫోర్లు) పోరాటంతో ఫాలో ఆన్ తప్పించాడు. 196 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో స్మిత్ మళ్లీ అడ్డుగోడలా నిలిచాడు. సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. వేడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు.
Comments
Please login to add a commentAdd a comment