టెస్ట్ ర్యాంకింగ్‌లో పూజారాకు 6వ స్థానం | Cheteshwar Pujara maintains sixth position in Test rankings | Sakshi
Sakshi News home page

టెస్ట్ ర్యాంకింగ్‌లో పూజారాకు 6వ స్థానం

Published Tue, Aug 6 2013 7:02 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

టెస్ట్ ర్యాంకింగ్‌లో పూజారాకు 6వ స్థానం

టెస్ట్ ర్యాంకింగ్‌లో పూజారాకు 6వ స్థానం

దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో భారత ఓపెనింగ్ టెస్టు ఆటగాడు పూజారాకు తిరిగి చోటు సంపాదించుకున్నాడు. 777 పాయింట్లతో ఉన్న చటేశ్వర పూజారా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో 6వ స్థానానికి చేరుకున్నాడు.  టాప్ 20లో భారత్  తరుపున  పూజారాకు ఒక్కడికే స్థానం దక్కడం గమనార్హం. ఇదిలా ఉండగా, టెస్టు ర్యాంకింగ్‌లో దక్షిణాఫ్రికా అటగాడు హషీమ్ ఆమ్లా 903 పాయింట్లతో ప్రధమ స్థానం దక్కించుకున్నాడు.

ఈ మధ్య కాలంలో ర్యాంకింగ్ దిగజార్చుకున్న ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. యాషెస్ తొలి టెస్టులో 187 పరుగులతో రాణించడంతో రెండవ స్థానాన్ని సాధించాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ ఇద్దరు భారత బౌలర్లకు మాత్రమే స్థానం దక్కింది. రవిచందన్ అశ్విన్‌కు 8 స్థానంలో కొనసాగుతుండగా, ప్రజ్ఞాన్ ఓజా , 10 వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement