దుబాయ్‌లో అశ్విన్‌ అకాడమీ | Ashwin Academy in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో అశ్విన్‌ అకాడమీ

Published Fri, Aug 18 2017 12:49 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

దుబాయ్‌లో అశ్విన్‌ అకాడమీ

దుబాయ్‌లో అశ్విన్‌ అకాడమీ

చెన్నై: సీనియర్‌ సహచరుడు ధోని బాటలోనే భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా దుబాయ్‌లో క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నాడు. జనరేషన్‌ నెక్ట్స్‌ పేరుతో నిర్వహించే ఈ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తారు. ఇదే పేరుతో అశ్విన్‌కు చెన్నైలో ఇప్పటికే సొంత అకాడమీ ఉంది.

అకాడమీ కోసం కోచింగ్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అశ్విన్‌ స్వయంగా రూపొందించడం విశేషం. ఈ నెల చివర్లో అకాడమీ ప్రారంభమవుతుంది. దీనికి డైరెక్టర్‌గా మాజీ క్రికెటర్, కెన్యా క్రికెట్‌ సీఈఓ కోబస్‌ ఒలివర్‌ను అశ్విన్‌ నియమించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement