Ashes 2023 ENG Vs AUS: Pat Cummins Knocks Over Ollie Pope With A Toe Crushing Yorker, Video Viral - Sakshi
Sakshi News home page

#Ashes2023: ఇదేమి యార్కర్‌రా బాబు.. దెబ్బకు బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published Tue, Jun 20 2023 10:53 AM | Last Updated on Tue, Jun 20 2023 12:12 PM

Pat Cummins Toe Crushing Yorker Sends Ollie Pope - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది.

క్రీజులో ఉస్మాన్‌ ఖ్వాజా(34), స్కాట్‌ బోలాండ్‌(13) నాటౌట్‌గా ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలిపి ఇంగ్లండ్‌ ఆసీస్‌ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

కమ్మిన్స్‌ సూపర్‌ యార్కర్‌
ఇక ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌కు అడ్డుకట్ట వేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్భుతమైన యార్కర్‌తో కమ్మిన్స్‌ బోల్తా కొట్టించాడు.

139 కిమీ వేగంతో వేసిన యార్కర్‌కు పోప్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో 14 పరుగులు చేసిన ఓలీ పోప్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిCWC Qualifiers2023: ఐర్లాండ్‌కు బిగ్‌ షాకిచ్చిన ఒమన్‌.. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బోణీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement