
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుకు వేదికైన పెర్త్ పిచ్ యావరేజ్‌గా ఉందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే నివేదిక ఇచ్చారు. ఇందులో ఆసీస్ గెలిచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసిన సంగతి తెలిసిందే.
రిఫరీ రంజన్ మదుగలే పెర్త్ స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్ ఓ మాదిరిగా ఉందని అత్తెసరు మార్కులు ఇచ్చారు. భారత్ గెలిచిన అడిలైడ్ ఓవల్ పిచ్‌కు రిఫరీ ‘చాలా బాగుంది’ అనే రేటింగ్ ఇచ్చారు. టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన వేదికలకు ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రేటింగ్స్‌ను ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment