టీ20 ప్రపంచకప్-2022లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(ఆక్టోబర్ 30) పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. దక్షిణాఫ్రికా తమ మునపటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా.. భారత్ నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా నాలుగు పాయింట్లతో ఆగ్ర స్థానంలో ఉంది.
అదే విధంగా దక్షిణాఫ్రికా మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా నెదర్లాండ్స్‌తో జరిగిన అఖరి మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించి కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తాన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అశ్విన్ స్థానంలో అదనపు పేసర్ హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో డికాక్, రౌసో దుమ్మురేపుతున్నారు. మిడిలార్డర్‌లో మార్‌క్రమ్, మిల్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో నోర్జే, రబాడ వంటి సీనియర్ పేసర్లు ఉన్నారు.
పిచ్ వాతావరణం
పెర్త్ మైదానం బౌలర్లకు స్వర్గధామం. అయితే బ్యాటర్లు ఒక్క సారి క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు వరద పారించవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌కు పెద్దగా వర్షం ముప్పు పొంచిలేదు.
ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ మెటియరాలజీ ప్రకారం "పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. స్వల్పంగా (30%) వర్షం కురిసే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
చదవండి: T20 WC 2022: దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment