టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్‌లో భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఓ వైపు దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతుంటే.. సూర్య మాత్రం అదే బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ బౌలర్లను చితక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా సూర్యను పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షోయబ్ మాలిక్ పొగడ్తలతో ముంచెత్తాడు ముంచెత్తాడు. సూర్య ఆడే షాట్లు అద్భుతమైనవి అంటూ మాలిక్ కొనియాడాడు.
ఏ స్పోర్ట్స్‌తో మాలిక్ మాట్లాడుతూ.. "ప్రస్తత ప్రపంచ క్రికెట్‌లో సూర్య అందరి కంటే భిన్నమైన ఆటగాడు. అతడు ఆడే షాట్లు అద్భుతమైనవి. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. అతడు స్కూప్ షాట్స్‌ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు.
సూర్య బ్యాటింగ్ విధానాన్ని చూసి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకోవాలి. అయితే అటువంటి షాట్స్ ఆడాలంటే చాలా కష్టపడాలి. సూర్య బౌలర్ల మైండ్‌తో కూడా ఆడుకుంటాడు. బౌలర్లు ఏ బంతి వేసిన కొట్టడానికి సూర్య సిద్దంగా ఉంటాడని" పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment