భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నవంబర్ 8న డర్బన్ వేదికగా జరుగనుంది. రెండో టీ20 గ్వ్కెబెర్హా వేదికగా నవంబర్ 10న జరుగుతుంది. మూడో మ్యాచ్ సెంచూరియన్ వేదికగా నవంబర్ 13న.. నాలుగో టీ20 జొహనెస్‌బర్గ్ వేదికగా నవంబర్ 15న జరుగనున్నాయి. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పలు భారీ రికార్డులపై కన్నేశాడు.
మరో 107 పరుగులు చేస్తే..
ఈ సిరీస్‌లో స్కై మరో 107 పరుగులు చేస్తే, భారత్-సౌతాఫ్రికా మధ్య టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ మిల్లర్ పేరిట ఉంది. మిల్లర్ 21 మ్యాచ్‌ల్లో 156.94 స్ట్రయిక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. స్కై సౌతాఫ్రికాతో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 175.63 స్ట్రయిక్‌రేట్ చొప్పున 346 పరుగులు చేశాడు.
మరో ఆరు సిక్సర్లు..
ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మరో ఆరు సిక్సర్లు కొడితే టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సర్ల మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం స్కై 71 ఇన్నింగ్స్‌ల్లో 144 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో నికోలస్ పూరన్‌తో (144) కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (205) టాప్‌లో ఉండగా.. మార్టిన్ గప్తిల్ (173) రెండో స్థానంలో ఉన్నాడు.
మరో రెండు శతకాలు..
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాదిన సూర్యకుమార్, దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే సిరీస్‌లో మరో రెండు శతకాలు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. టీ20ల్లో అత్యధిక శతకాల జాబితాలో సూర్యకుమార్ కంటే ముందు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు. ఈ ఇద్దరు పొట్టి ఫార్మాట్‌లో చెరి ఐదు శతకాలు సాధించారు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment