గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను సూర్యకుమార్ యాదవ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ టీ20ల్లో 1000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
కాగా 573 బంతుల్లోనే సూర్య ఈ ఘనత సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. 604 బంతుల్లో మాక్స్‌వెల్ 1000 పరుగులు సాధించాడు.
అదే విధంగా ఈ మ్యాచ్‌లో సూర్య తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన మూడో భారత బ్యాటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. అంతకుముందు యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరోవైపు కెఎల్ రాహుల్ కూడా 2021లో స్కాట్‌లాండ్‌పై 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గ్రౌండ్‌లోకి వచ్చిన పాము! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment