పెర్త్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది.
ఆప్టస్ స్టేడియంలో ఆసీస్‌ను ఓడించిన తొలి జట్టు
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఇదే తొలి పరాజయం. ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.
నంబర్ వన్‌గా టీమిండియా
పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరడంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది.
నాలుగులో మూడింట విజయాలు..
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గత నాలుగు టెస్ట్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. గత బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ చివరి మూడు టెస్ట్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.
భారీ విజయం
పెర్త్ టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) భారత్‌కు ఇది భారీ విజయం.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రా
ఈ మ్యాచ్ మొత్తంలో ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా (5/30), సిరాజ్ (2/20), హర్షిత్ రాణా (3/48) కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. రాహుల్ 77 అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.
534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలో మూడు.. సుందర్ రెండు.. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment