నిమిషంన్నరపాటు విన్న చైనా నౌక సిబ్బంది
మలేసియా విమానం కోసం
కొనసాగుతున్న అన్వేషణ
పెర్త్(ఆస్ట్రేలియా): మలేసియా బోయింగ్ విమానం కోసం సాగుతున్న అన్వేషణ శనివారం కీలక మలుపు తిరిగింది. దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలిస్తున్న ఓ చైనా నౌకలోని బ్లాక్‌బాక్స్ డిటెక్టర్‌కు పల్స్ సిగ్నళ్లు అందాయి. వీటి పౌనఃపున్య తీవ్రతను సెకనుకు 37.5 కిలోహెర్‌ట్జగా గుర్తించారు.
అయితే ఇవి గల్లంతైన విమానంలోని బ్లాక్స్‌బాక్స్ నుంచి వచ్చాయో లేక, మరో వస్తువు నుంచి వచ్చాయో నిర్ధారించాల్సి ఉందని అధికార వార్తాసంస్థ ‘జినువా’ తెలిపింది. 25 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 101 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద హైజున్01 నౌకలోని ముగ్గురు సిబ్బందికి ఉన్నట్టుండి నిమిషంన్నరపాటు సిగ్నళ్లు వినిపించాయి. అయితే వీటిని రికార్డు చేయలేకపోయారు.
నౌక సిబ్బందికి వినిపించిన సిగ్నళ్లు బ్లాక్‌బాక్స్‌కే ప్రత్యేకం కాదని, అవి ఇతర వస్తువుల నుంచి కూడా వెలువడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత నెల 8న గల్లంతైన బోయింగ్‌లోని బ్లాక్‌బాక్స్ బ్యాటరీల జీవితం కాలం మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో దాని కోసం గాలింపును ముమ్మరం చేశారు. పల్స్ సిగ్నల్స్ అందడంతో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించే పరికరాలను రంగంలోకి దించనున్నారు. బ్లాక్‌బాక్స్ సిగ్నల్‌ను బ్లాక్‌బాక్స్‌కు మూడు మైళ్ల వ్యాసార్ధంలోని పరిధిలో అందుకోవచ్చు. విమాన శకలాల కోసం పెర్త్‌కు వాయవ్యంగా 1,700 కి.మీ దూరంలో పలు దేశాల విమానాలు గాలిస్తుండడం తెలిసిందే. శనివారం ఇదే ప్రాంతంలో తేలియాడుతున్న వస్తువులను చైనా విమానం గుర్తించింది.
సముద్రంలో బ్లాక్ బాక్స్ సిగ్నళ్లు!
Published Sun, Apr 6 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement
Advertisement