మస్త్ మస్త్ ముంబై | Mumbai Indians make CLT20 semis (Roundup) | Sakshi
Sakshi News home page

మస్త్ మస్త్ ముంబై

Published Thu, Oct 3 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

మస్త్ మస్త్ ముంబై

మస్త్ మస్త్ ముంబై

చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ముంబై ఇండియన్స్ సెమీస్‌కు చేరుతుంది. ఇలాంటి స్థితిలో చాంపియన్‌‌స లీగ్‌లో రోహిత్‌ సేన మ్యాజిక్‌ చేసింది. 14.2 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే నాకౌట్‌కు చేరే అవకాశం. ఈ దశలో రోహిత్‌, స్మిత్‌ విశ్వరూపం చూపించారు. పెర్‌‌త బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సంచలన ఇన్నింగ్‌‌స ఆడారు. ఫలితంగా కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ముంబై ఇండియన్‌‌స దర్జాగా సెమీస్‌కు చేరింది.
 
న్యూఢిల్లీ: ఇప్పటికే చాంపియన్‌‌స లీగ్‌ను మరో ఐపీఎల్‌ అంటున్నారు. ఆ పేరుకు తగ్గట్లే ఈసారి మూడు ఐపీఎల్‌ జట్లు సెమీస్‌కు చేరాయి. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పెర్‌‌తపై సంచలన విజయం సాధించిన ముంబై...ఒటాగో వోల్‌‌ట్సను రన్‌రేట్‌లో వెనక్కు నెట్టి.... చెన్నైన, రాజస్థాన్‌ల సరసన సెమీస్‌కు చేరింది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఎ గ్రూప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్‌‌సను చిత్తు చేసింది.‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్‌‌సలు), డ్వేన్‌ స్మిత్‌ (25 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్‌‌సలు) భారీ షాట్లతో హోరెత్తించారు. ఫలితంగా ముంబై 13.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 152 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంతకు ముందు స్కార్చర్‌‌స 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వైట్‌మన్‌ (32 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్‌‌సలు) అర్ధ సెంచరీ చేయగా, ఎగర్‌ (40 బంతుల్లో 35; 6 ఫోర్లు), కార్‌‌టరైట్‌ (20 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. కట్టడి చేసిన కౌల్టర్‌...
 
పెర్త్ ఓపెనర్లు ఎగర్‌, కటిచ్‌ (13) కలిసి తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించినా ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. ఓజా ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్‌ చేసి స్కార్చర్‌‌సను దెబ్బ తీశాడు. అయితే కార్‌‌టరైట్‌, వైట్‌మన్‌ కలిసి జట్టు ఇన్నింగ్‌‌సను నడిపించారు. చక్కటి బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన కౌల్టర్‌, వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో పెర్‌‌త ఇన్నింగ్‌‌స తడబడింది. వైట్‌మన్‌ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్‌ డకౌట్‌...విజయానికి 14.2 ఓవర్లలోనే 150 పరుగులు చేయాల్సిన ముంబై ఇండియన్‌‌సకు డ్వేన్‌ స్మిత్‌ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. మరో వైపు సచిన్‌ టెండూల్కర్‌ (0) మాత్రం మరోసారి నిరాశపర్చాడు. బెహ్రన్‌డార్‌‌ఫ బౌలింగ్‌లో వైట్‌మన్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో అతను నిష్కమించాడు. 
 
మ్యాక్‌‌సవెల్‌ (10) కూడా తొందరానే వెనుదిరిగినా స్మిత్‌ తన జోరును కొనసాగించాడు. స్మిత్‌ వెనుదిరగడంతో ముంబై ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టి20ల్లో తన అద్భుత రికార్డును కొనసాగిస్తూ చెలరేగాడు. పొలార్‌‌డ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్‌‌స) అండగా నిలవడంతో భారీ సిక్సర్లతో జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. రాయుడు (4 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్‌‌సలు) వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో మరో ఓవర్‌ మిగిలి ఉండగానే ముంబై సెమీస్‌కు చేరింది. స్కోరు వివరాలు: పెర్‌‌త స్కార్చర్‌‌స ఇన్నింగ్‌‌స: ఎగర్‌ (బి) ఓజా 35; కటిచ్‌ (బి) ఓజా 13; కార్‌‌టరైట్‌ (బి) కౌల్టర్‌ 28; వైట్‌మన్‌ (నాటౌట్‌) 51; టర్నర్‌ (ఎల్బీ) (బి) కౌల్టర్‌ 0; నార్‌‌త (సి) పొలార్‌‌డ (బి) కౌల్టర్‌ 3; ట్రిఫిట్‌ (బి) రిషిధావన్‌ 1; బెహ్రన్‌డార్‌‌ఫ (నాటౌట్‌) 1; ఎక్‌‌సట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149.
 
వికెట్ల పతనం: 1-55; 2-56; 3-114; 4-114; 5-130; 6-143.
బౌలింగ్‌: హర్భజన్‌ 4-0-31-0; కౌల్టర్‌ 4-0-19-3; రిషిధావన్‌ 4-0-30-1; పొలార్‌‌డ 3-0-26-0; మ్యాక్‌‌సవెల్‌ 3-0-14-0; ఓజా 2-0-17-2.
 
ముంబై ఇండియన్స్  ఇన్నింగ్‌‌స: స్మిత్‌ (సి) బెహ్రన్‌డార్‌‌ఫ (బి) హాగ్‌ 48; సచిన్‌ (సి) వైట్‌మన్‌ (బి) బెహ్రన్‌డార్‌‌ఫ 0; మ్యాక్‌‌సవెల్‌ (సి) హాగ్‌ (బి) బెహ్రన్‌డార్‌‌ఫ 10; రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 51; పొలార్‌‌డ (బి) హాగ్‌ 23; రాయుడు (నాటౌట్‌) 14; ఎక్‌‌సట్రాలు 6; మొత్తం (13.2 ఓవర్లలో 4 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-16; 2-34; 3-72; 4-137.
 
బౌలింగ్‌: బీర్‌ 4-0-34-0; బెహ్రన్‌డార్‌‌ఫ 3-0-31-2; పారిస్‌ 2-0-36-0; హాగ్‌ 3-0-26-2; ఎగర్‌ 1.2-0-23-0. 2
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement