
టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో అఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ అంశంలో కనీసం థర్డ్ అంపైర్ అయినా కలగజేసుకుని ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు 5 పరుగులు కలిసొచ్చేవని, దాంతో తాము గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ స్వీపర్ కవర్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్లు రెండో పరుగు పూర్తే చేసే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఈ క్రమంలో ఇన్‌సైడ్ రింగ్‌లో ఉన్న కోహ్లి మాత్రం.. బంతి తన చేతిలో లేకపోయినప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసేటట్లు యాక్షన్ చేశాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదు. అదే విధంగా ఇద్దరు బ్యాటర్లు లిటన్ దాస్, షాంటోలు ఏ విధమైన అప్పీల్ చేయలేదు.
ఐసీసీ నియమం 41.5 ప్రకారం.. "బ్యాటర్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అడ్డుకోవడం వంటివి చేయకూడదు". అటువంటి సంఘటన జరిగితే అంపైర్లు నిబంధనల ప్రకారం ఆ బంతిని డెల్ బాల్‌గా ప్రకటించవచ్చు. అదే విధంగా బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ కూడా ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ కోహ్లి చర్యతో బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్, షాంటోలు ఎక్కడా డిస్టర్బ్ అయినట్లు గానీ.. మోసం జరిగినట్లు కానీ ఫిర్యాదు చేయలేదు. ఈ లెక్కన కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం కావొచ్చు. కానీ అతని చర్యతో బంగ్లా బ్యాటర్లు ఎక్కడా డిస్టర్బ్ అయినట్లు మాత్రం కనిపించలేదు. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఫెనాల్టీ రూపంలో ఇవ్వలేదని క్రీడా పండితులు పేర్కొన్నారు.
What are your thoughts on #Kohli fake fielding? Is this considered fake? pic.twitter.com/Pu2y6qint9
— Quickr Quacker (@QuickrOlx) November 3, 2022
చదవండి: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వల్లే ఇదంతా! లేదంటే బంగ్లాదే గెలుపు అంటూ..
కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..!