Nurul Hasan
-
అయ్యో బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఎబాడోత్ హుస్సేన్, ఖలీల్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా వికెట్ కీపర్ నూరల్ హసన్ చేసిన చిన్న తప్పిదం వల్ల భారత్‌కు ఐదు పరుగులు లభించాయి. ఏం జరిగిందంటే? భారత్ ఇన్నింగ్స్ 112 ఓవర్ వేసిన తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో.. అశ్విన్ థర్డ్‌మ్యాన్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న యాసిర్ అలీ బంతి కోసం పరిగెత్తుతూ వెళ్లి అక్కడ నుంచి త్రో వికెట్ కీపర్ వైపు చేశాడు. అయితే అతడు త్రో చేసిన బంతి నేరుగా వికెట్ కీపర్ హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం టీమిండియాకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. 5 penalty runs !! Yasir Ali hits the ⛑️ pic.twitter.com/pMQ373lMWZ — Cricket Videos (@kirket_video) December 15, 2022 చదవండి: IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. 404 పరుగులకు భారత్ ఆలౌట్ -
డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే ఐదు పరుగులు ఇవ్వలేదు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో అఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ అంశంలో కనీసం థర్డ్ అంపైర్ అయినా కలగజేసుకుని ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు 5 పరుగులు కలిసొచ్చేవని, దాంతో తాము గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ స్వీపర్ కవర్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్లు రెండో పరుగు పూర్తే చేసే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ రింగ్‌లో ఉన్న కోహ్లి మాత్రం.. బంతి తన చేతిలో లేకపోయినప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసేటట్లు యాక్షన్ చేశాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదు. అదే విధంగా ఇద్దరు బ్యాటర్లు లిటన్ దాస్, షాంటోలు ఏ విధమైన అప్పీల్ చేయలేదు. ఐసీసీ నియమం 41.5 ప్రకారం.. "బ్యాటర్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అడ్డుకోవడం వంటివి చేయకూడదు". అటువంటి సంఘటన జరిగితే అంపైర్లు నిబంధనల ప్రకారం ఆ బంతిని డెల్ బాల్‌గా ప్రకటించవచ్చు. అదే విధంగా బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ కూడా ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ కోహ్లి చర్యతో బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్, షాంటోలు ఎక్కడా డిస్టర్బ్ అయినట్లు గానీ.. మోసం జరిగినట్లు కానీ ఫిర్యాదు చేయలేదు. ఈ లెక్కన కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం కావొచ్చు. కానీ అతని చర్యతో బంగ్లా బ్యాటర్లు ఎక్కడా డిస్టర్బ్ అయినట్లు మాత్రం కనిపించలేదు. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఫెనాల్టీ రూపంలో ఇవ్వలేదని క్రీడా పండితులు పేర్కొన్నారు. What are your thoughts on #Kohli fake fielding? Is this considered fake? pic.twitter.com/Pu2y6qint9 — Quickr Quacker (@QuickrOlx) November 3, 2022 చదవండి: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వల్లే ఇదంతా! లేదంటే బంగ్లాదే గెలుపు అంటూ.. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! -
Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న (నవంబర్ 2) జరిగిన రసవత్తర సమరం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ, చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మోసం చేసి గెలిచిందని బంగ్లాదేశ్ ఆటగాళ్లు, అభిమానులు బాహాటంగా ఆరోపిస్తుండటం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by IPL TEAMS TROLLS (@iplteamstrolls) బంగ్లా అభిమానులు.. చీటింగ్, ఫేక్ ఫీల్డింగ్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేస్తే అందుకు అంపైర్లు సహకరించారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లి అప్పీల్ చేయంగానే నో బాల్ ప్రకటించే అంపైర్లు, అదే వ్యక్తి తొండాట (బంతి చేతిలో లేకపోయిన వికెట్లపైకి త్రో చేస్తున్నట్లు నటించడం) ఆడుతుంటే చూసీచూడనట్లు ఎలా వ్యవహరిస్తారని నిలదీస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఒకటి కాదు రెండు కాదు మ్యాచ్ మొత్తం అంపైర్లు టీమిండియాకు అనుకూలంగానే వ్యవహరించారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అంపైర్లు అవగాహనా రాహిత్యంగా వ్యవహరించారో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో కానీ మొత్తంగా మా కొంప మునిగిందని వాపోతున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ అంశంలో కనీసం థర్డ్ అంపైర్ అయినా కలగజేసుకుని ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు 5 పరుగులు కలిసొచ్చేవని, దాంతో తాము గెలిచేవారమని లబోదిబోమంటున్నారు. #FakeFielding or not ???#Askthepavilion #PakVSa #NoBall pic.twitter.com/1Z25J8WVDV— Muhammad Shehroz 🇵🇰 (@Iam_Shehroz) November 2, 2022 ఛేదనలో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకుపోతున్న తమను వరుణుడు అడ్డగించి, తమ విజయావశాలపై నీళ్లు చల్లాడని ప్రకృతిపై విధ్వేశాన్ని వెల్లగక్కుతున్నారు. వర్షం వల్ల పిచ్‌పై తేమ చేరడంతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్న లిటన్ దాస్ రనౌటయ్యాడని, ఇదే తమ జట్టును లయ తప్పేలా చేసిందని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఇదే టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌లో కూడా అంపైర్లు ఇలాగే వ్యవహరించారని, ఆఖరి నిమషంలో భారత్‌కు సహకరించారని ఆరోపిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు కొన్ని తప్పిదాలను ఉద్ధేశపూర్వకంగా చేసినా ప్రశ్నించే వారే లేరని ఏకరవు పెడుతున్నారు. ఏదిఏమైనా కోహ్లి ఫేక్ ఫీల్డింగ్, అంపైరింగ్‌లో లోపాలు, వరుణుడి ఆటంకం తమ కొంప ముంచాయని బంగ్లా అభిమానులు వాపోతున్నారు. కాగా, బంగ్లా ఫ్యాన్స్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు భారత అభిమానులు సైతం ఓ రేంజ్లో కౌంటరిస్తున్నారు. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేస్తుంటే బంగ్లా ఆటగాళ్లు అప్పుడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫలితం మీకు అనుకూలంగా వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా ప్రవర్తించడం మీకు అలవాటేనని ఎదురుదాడికి దిగుతున్నారు. అదృష్టం కొద్దీ ఏదో నెదర్లాండ్స్, జింబాబ్వేలపై గెలవాగానే హీరోలమని ఫీలవుతున్నట్లున్నారని ఏకి పారేస్తున్నారు. ఆడలేక ఓడి, ప్రత్యర్ధిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని చురకలంటిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా, అంపైర్ మీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా మీరెలా ప్రవర్తిస్తారో ప్రపంచం మొత్తం చూసిందని షకీబ్, బంగ్లా అండర్-19 జట్ల ఉదంతాలను ఉదహరిస్తున్నారు. -
Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ వల్లే ఇదంతా! లేదంటే బంగ్లాదే గెలుపు అంటూ..
బంగ్లాదేశ్‌తో అఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఫేక్ ఫీల్డింగ్ వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. విరాట్ ఫేక్ ఫీల్డింగ్‌ను అంపైర్లు గుర్తించలేదని హసన్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో నూరుల్ హసన్ మాట్లాడుతూ.. "ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్నప్పటికీ అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు. అటువంటింది మా ఇన్నింగ్స్ మధ్యలో కోహ్లి నకిలీ ఫీల్డింగ్‌ను మాత్రం గుర్తించలేకపోయారు. ఒకవేళ అంపైర్లు అది గమనించినట్లయితే మాకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవి. తద్వారా ఈ మ్యాచ్‌లో మేము విజయం సాధించే వాళ్లం. కానీ దురదృష్టవశాత్తు అది కూడా జరగలేదు" అని అతడు పేర్కొన్నాడు. అసలేం జరిగిందంటే? బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ స్వీపర్ కవర్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్లు రెండో పరుగు పూర్తే చేసే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ రింగ్‌లో ఉన్న కోహ్లి మాత్రం.. బంతి తన చేతిలో లేకపోయినప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసేటట్లు యాక్షన్ చేశాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదు. అదే విధంగా ఇద్దరు బ్యాటర్లు లిటన్ దాస్, షాంటో కూడా ఏ విధమైన అప్పీల్ చేయలేదు. ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయి? ఐసీసీ నియమం 41.5 ప్రకారం.. "బ్యాటర్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అడ్డుకోవడం వంటివి చేయకూడదు". అటువంటి సంఘటన జరిగితే అంపైర్లు నిబంధనల ప్రకారం ఆ బంతిని డెల్ బాల్‌గా ప్రకటించవచ్చు. అదే విధంగా బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ కూడా ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలోనే నూరుల్ హసన్ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే, ‘‘వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అయిన కోహ్లి.. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి బ్యాటర్లను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడు’’ అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి కొంత మంది నాన్ స్ట్రైక్ వైపు త్రో చేయమని అర్ష్‌దీప్‌కు విరాట్ సైగలు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కోహ్లి చర్య సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); #FakeFielding or not ???#Askthepavilion #PakVSa #NoBall pic.twitter.com/1Z25J8WVDV — Muhammad Shehroz 🇵🇰 (@Iam_Shehroz) November 2, 2022 చదవండి: T20 WC 2022: అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్? -
SA Vs BAN: పాపం బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బౌలర్లలో నోర్జే నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. షాంసీ మూడు, రబాడ, మహారాజ్ తలా వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో రిలీ రోసో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ డికాక్ 63 పరుగులతో రాణించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా వికెట్ కీపర్ నూరల్ హసన్ చేసిన చిన్న తప్పిదం వల్ల దక్షిణాఫ్రికా 5 పెనాల్టీ పరుగులు లభించించాయి. ఏం జరిగిందంటే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్‌లో అఖరి బంతి డెలివర్ కాకముందే బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎడమ వైపుకు వెళ్లాడు. నింబంధనల బౌలర్ రన్-అప్ సమయంలో వికెట్ కీపర్ కదలడానికి అనుమతి లేదు. దీంతో అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు. ఆప్పడు బంతి డికాక్ గ్లౌవ్కు తాకడంతో అంపైర్లు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. pic.twitter.com/1STBiuR0Ff — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 27, 2022 చదవండి: IPL 2023: శార్దూల్ ఠాకూర్‌కు ఢిల్లీ క్యాపిటిల్స్ గుడ్‌బై! -
Ban Vs UAE: గట్టి పోటీనిచ్చిన యూఏఈ! అఫిఫ్ అద్భుత ఇన్నింగ్స్! బంగ్లాదే పైచేయి!
United Arab Emirates vs Bangladesh, 1st T20I- Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ అఫిఫ్ హొసేన్ అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 బంతుల్లో అతడు 7 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైన వేళ విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. తద్వారా మొదటి టీ20లో గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ముందంజలో నిలిచింది. అదరగొట్టిన యూఏఈ బౌలర్లు.. కానీ! ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అఫిఫ్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది నురుల్ హసన్ బృందం. ఉత్కంఠ పోరులో ఆఖరికి! ఇక లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. ఓపెనర్ చిరాగ్ సూరి శుభారంభం అందించినా మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆఖరల్లో కార్తిక్ మయప్పన్(12), జునైద్ సిద్ధిఖీ(11) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 151 పరుగులకు యూఏఈ ఆలౌట్ కావడంతో 7 పరుగుల తేడాతో విజయం బంగ్లాదేశ్‌ను వరించింది. ఇక ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన అఫిఫ్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉండటంతో నరుల్ హసన్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్ Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్ ప్రత్యేకం.. ఎందుకంటే! -
బంగ్లాను వెంటాడుతున్న గాయాలు.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
ఆసియాకప్ 2022 ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ లిట్టన్ దాస్ కండరాల గాయంతో నెలరోజుల కిందటే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న హసన్ మహ్ముద్, వికెట్ కీపర్ నురుల్ హసన్‌లు గాయాలతో దూరమయ్యారు. గతవారం ట్రెయినింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హసన్ చీలమండకు గాయమైంది. ఎక్స్‌రే తీయగా గాయం తీవ్రత పెద్దదని తేలడంతో నెలరోజుల విశ్రాంతి అవసరమైంది. ఇక మరో ఆటగాడు నురుల్ హసన్ ఇటీవలే చేతి వేలికి గాయం అవడంతో సర్జరీ జరిగింది. అతను కోలుకోవడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు ఆసియాకప్ టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది.ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ఆసియా కప్‌లో జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. షకీబ్ నేతృతంలోని 17 మందితో కూడిన బంగ్లాదేశ్ జట్టు మంగళవారం యూఏఈలో అడుగుపెట్టింది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని షకీబ్‌కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు) ప్రకటించింది. చదవండి: Asia Cup 2022: తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు -
ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్! వికెట్ కీపర్ దూరం!
ఆసియాకప్-2022కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ సోహన్ గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. కాగా జింబాబ్వేతో రెండో టీ20లో కెప్టెన్‌గా వ్యవహరించిన నూరుల్ హసన్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు జింబాబ్వేతో అఖరి టీ20తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో అఖరి టీ20కు మోసద్దేక్ హుస్సేన్ బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు. కాగా ఈ సిరీస్‌లో గాయపడిన నూరుల్ హాసన్ నేరుగా జింబాబ్వే నుంచి సింగపూర్‌కు చేరుకున్నాడు. సింగపూర్‌లో అతడు తన చేతి వేలుకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. "సోమవారం(ఆగస్టు 8) సింగపూర్‌లోని రాఫెల్స్ హాస్పిటల్లో సోహన్ ఎడమ చేతి చూపుడు వేలికి సర్జరీ నిర్వహించడం జరిగింది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది" అని బీసీబీ చీఫ్ ఫిజీషియన్ దేబాశిష్ చౌదరి పేర్కొన్నాడు. మరోవైపు జింబాబ్వేతో తొలి వన్డేలో గాయపడిన బంగ్లా స్టార్ వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఆసియా కప్‌కు తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్-20022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనుంది. చదవండి: Asia Cup 2022: పాక్ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి -
జింబాబ్వేతో మూడో టీ20.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మొసద్దెక్ హొస్సేన్
జింబాబ్వేతో మూడో టీ20కు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మొసద్దెక్ హొస్సేన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. కాగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంగ్లా స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ చేతి వేలికి గాయమైంది. దాంతో నూరుల్ హసన్ అఖరి టీ20తో పాటు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నూరుల్ స్థానంలో మొసద్దెక్కు కెప్టెన్సీ బాధ్యతలు బంగ్లా క్రికెట్ బోర్డు అప్పగించింది. కాగా హారారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మొసద్దెక్ హొస్సేన్ 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా) మునిమ్ షహరియార్, లిటన్ దాస్, అనముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, అఫీఫ్ హొస్సేన్, పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, మొసద్దెక్ హొస్సేన్(కెప్టెన్), మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్ చదవండి: IND Vs WI Delay: భారత్-విండీస్ రెండో టీ20.. రెండు గంటలు ఆలస్యం.. కారణం ఇదే! -
జింబాబ్వేతో మూడో టీ20.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
ఆదివారం హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపు జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరం కానున్నాడు. కాగా రెండో టీ20లో వికెట్ కీపింగ్ చేస్తున్నసమయంలో నూరుల్ హసన్ చేచేతి వేలికి గాయమైంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు బంగ్లా వైద్య బృందం వెల్లడించింది. "నూరుల్ చేతికి గాయమైన తర్వాత మేము ఎక్స్‌రే తీశాము. అతడి చూపుడు వేలుకు గాయమైంది. అతడు ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది" అని బంగ్లా జట్టు ఫిజియో ముజాద్డ్ ఆల్ఫా సానీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అఖరి టీ20కు, వన్డే సిరీస్‌కు నూరుల్ హసన్ దూరం కానున్నాడు. కాగా గాయపడిన హసన్ స్థానంలో లిటాన్ దాస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. అనంతరం మూడో వన్డేల సిరీస్‌లో జింబాబ్వేతో బంగ్లాదేశ్ తలపడనుంది. చదవండి: Deandra Dottin: అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం!