
ఆదివారం హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపు జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ గాయం కారణంగా జింబాబ్వే పర్యటన మొత్తానికి దూరం కానున్నాడు. కాగా రెండో టీ20లో వికెట్ కీపింగ్ చేస్తున్నసమయంలో నూరుల్ హసన్ చేచేతి వేలికి గాయమైంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు బంగ్లా వైద్య బృందం వెల్లడించింది. "నూరుల్ చేతికి గాయమైన తర్వాత మేము ఎక్స్రే తీశాము.
అతడి చూపుడు వేలుకు గాయమైంది. అతడు ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది" అని బంగ్లా జట్టు ఫిజియో ముజాద్డ్ ఆల్ఫా సానీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అఖరి టీ20కు, వన్డే సిరీస్‌కు నూరుల్ హసన్ దూరం కానున్నాడు.
కాగా గాయపడిన హసన్ స్థానంలో లిటాన్ దాస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. అనంతరం మూడో వన్డేల సిరీస్‌లో జింబాబ్వేతో బంగ్లాదేశ్ తలపడనుంది.
చదవండి: Deandra Dottin: అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం!