జింబాబ్వే వన్డే క్రికెట్‌లో చాన్నాళ్ల తర్వాత కొత్త రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టి20, వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించడమే గాక పూర్వవైభవం దిశగా అడుగులను మరింత సుస్థిరం చేసుకుంది. టి20 ప్రపంచకప్ 2022కు క్వాలిఫై అయ్యామన్న సంతోషం జింబాబ్వేను పూర్తిగా మార్చేసింది. స్వదేశంలో సిరీస్ ఆడుతున్నప్పటికి ఇంతకముందెన్నడూ చూడని జింబాబ్వేను చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. తొలి రెండు వన్డేలో జింబాబ్వే ప్రదర్శన అందుకు అతీతంగా అనిపించింది.
ఇక బుధవారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో ఓడినప్పటికి.. వారి పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా జింబాబ్వే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ, విక్టర్ న్యౌచిబ్‌లు పదో వికెట్‌కు రికార్డుస్థాయి భాగస్వామంతో మెరిశారు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒక దశలో 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.
అయితే టెయిలెండర్లు రిచర్డ్ నగరావ(34 నాటౌట్), విక్టర్ న్యౌచిబ్(26 పరుగుల) పదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జింబాబ్వే పరువును కాపాడారు. కాగా పదో వికెట్‌కు వీరిద్దరు నమోదు చేసిన భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో పదో స్థానం దక్కించుకుంది. తొలి స్థానంలో విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, మైకెల్ హోల్డింగ్ 106* పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉంది. మహ్మద్ అమిర్, సయీద్ అజ్మల్ 103 పరుగులతో రెండో స్థానంలో ఉంది. రాంపాల్, కీమర్ రోచ్ 99 పరుగులతో మూడో స్థానంలో ఉంది.
చదవండి: ZIM Vs BAN: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్ జింబాబ్వే సొంతం
#3rdODI | DRINKS! After 31 overs, 🇿🇼 are 144/9
— Zimbabwe Cricket (@ZimCricketv) August 10, 2022
Highest 10th wicket partnership for 🇿🇼 in ODIs
(Ngarava 29*, Nyauchi 24*), need 113 runs from 19 overs#ZIMvBAN | #WaltonODISeries | #VisitZimbabwe pic.twitter.com/aPER0mUyzA
Comments
Please login to add a commentAdd a comment