ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడమే జింబాబ్వేకు గొప్ప అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించామన్న ఆనందం జింబాబ్వేకు ఎనలేని ధైర్య తెచ్చిపెట్టింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను గెలుచుకున్న జింబాబ్వేకు పూర్వవైభవం వచ్చినట్లేనని అభిప్రాయపడ్డారు. అంతలోనే మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ .. జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.
కానీ బలమైన టీమిండియా ముందు వారి ఆటలు సాగలేదు. మూడు వన్డేల్లోనూ ఓడిన జింబాబ్వే వైట్‌వాష్‌కు గురయ్యింది. అయితే మూడో వన్డేలో మాత్రం టీమిండియాకు చుక్కలు చూపించింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. సికిందర్ రజా వీరోచితో సెంచరీతో దాదాపు జట్టును గెలిపించినంత పని చేశాడు. అయితే చివర్లో సికందర్ ఔట్ కావడంతో జింబాబ్వే విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. అలా టీమిండియాపై ఒక్క విజయం సాధించాలన్న కోరిక జింబాబ్వేకు నెరవేరలేదు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు జింబాబ్వే వారి గడ్డపై అడుగుపెట్టింది. తొలి రెండు వన్డేల్లో ఓటములు ఎదురవ్వడంతో మరో వైట్‌వాష్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియాను మొదట తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జింబాబ్వే.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడినప్పటికి కెప్టెన్ చక్‌బవా(37 పరుగులు నాటౌట్), మరుమాని(35 పరుగులు) రాణించి జట్టును గెలిపించారు. ఒక రకంగా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకున్నట్లయింది. కాగా ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించడంతో... ''టీమిండియాతో చేయలేనిది.. ఆసీస్‌తో చేసి చూపించారు.'' అని కామెంట్ చేశారు.
#3rdODI | Just in case you were wondering how we’re feeling after our historic victory over Australia in Townsville! 🇿🇼💪🏾#AUSvZIM | #VisitZimbabwe pic.twitter.com/qwMQIBRDsK
— Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022
చదవండి: AUS vs ZIM: ఆస్ట్రేలియా గడ్డ మీద జింబాబ్వే సరికొత్త చరిత్ర.. తొలిసారిగా
Serena Wiliams: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం
Comments
Please login to add a commentAdd a comment