జింబాబ్వేతో మూడో టీ20కు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మొసద్దెక్ హొస్సేన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. కాగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంగ్లా స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ చేతి వేలికి గాయమైంది. దాంతో నూరుల్ హసన్ అఖరి టీ20తో పాటు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నూరుల్ స్థానంలో మొసద్దెక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు బంగ్లా క్రికెట్ బోర్డు అప్పగించింది.
కాగా హారారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మొసద్దెక్ హొస్సేన్ 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)
మునిమ్ షహరియార్, లిటన్ దాస్, అనముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, అఫీఫ్ హొస్సేన్, పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, మొసద్దెక్ హొస్సేన్(కెప్టెన్), మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్
చదవండి: IND Vs WI Delay: భారత్-విండీస్ రెండో టీ20.. రెండు గంటలు ఆలస్యం.. కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment