bangaladesh cricketer
-
జింబాబ్వేతో మూడో టీ20.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మొసద్దెక్ హొస్సేన్
జింబాబ్వేతో మూడో టీ20కు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మొసద్దెక్ హొస్సేన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. కాగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో బంగ్లా స్టాండింగ్ కెప్టెన్ నూరుల్ హసన్ చేతి వేలికి గాయమైంది. దాంతో నూరుల్ హసన్ అఖరి టీ20తో పాటు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నూరుల్ స్థానంలో మొసద్దెక్కు కెప్టెన్సీ బాధ్యతలు బంగ్లా క్రికెట్ బోర్డు అప్పగించింది. కాగా హారారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మొసద్దెక్ హొస్సేన్ 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టీ20 హరారే వేదికగా మంగళ వారం (ఆగస్టు2)న జరగనుంది. బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా) మునిమ్ షహరియార్, లిటన్ దాస్, అనముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, అఫీఫ్ హొస్సేన్, పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, మొసద్దెక్ హొస్సేన్(కెప్టెన్), మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్ చదవండి: IND Vs WI Delay: భారత్-విండీస్ రెండో టీ20.. రెండు గంటలు ఆలస్యం.. కారణం ఇదే! -
భారత్‌లో ఆడాలని ఉంది: మోర్తజా
ఢాకా: బంగ్లాదేశ్ జట్టు 2000లోనే టెస్టు హోదా పొందినా ఇప్పటివరకు భారత్‌లో ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. పైగా ఆ జట్టు తొలిటెస్టు ఆడింది భారత్‌తోనే. ప్రస్తుతం బంగ్లా ఆటగాళ్లు భారత్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ జట్టు భారత్‌లో ఆడాలని కోరుకుంటోందని స్వయంగా కెప్టెన్ ముషఫ్రే మోర్తజా చెప్పాడు. ‘‘మా ఆటగాళ్లు భారత్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో భారత్‌లో మేం ఆడతాం’’ అని మోర్తజా ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ భారత్‌లో వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కాదు. ఆసియా కప్, ముక్కోణపు సిరీస్‌ల సందర్భంగా. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లో తమతో మ్యాచ్ సందర్భంగా వివాదం సృష్టించిన రోహిత్ అవుట్ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. భారత జట్టులో ఏ ఒక్క బ్యాట్స్మెన్నో టార్గెట్ చేయలేమని అందరూ ప్రతిభావంతులేనని అన్నాడు. డీఆర్ఎస్ నిబంధనకు భారత్ ఒప్పుకోకపోవడంపై మాట్లాడుతూ దాని గురించి పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో బంగ్లాలో భారత్ వన్డే సిరీస్ సందర్భంగా వర్షం అంతరాయం కల్గించకూడదని కోరుకుంటున్నట్లు తెలిపాడు.