
సాక్షి, అమరావతి: కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఎక్కడో ఒక చోటకు వెళ్లి యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. దీంతో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో ఈ క్లినిక్‌లలో ప్రత్యేక డాక్టర్‌తో పాటు ఒక స్టాఫ్‌నర్సు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
క్లినిక్‌లు ఎక్కడంటే?
వైద్య విధాన పరిషత్ పరిధిలో: టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ఆత్మకూరు, మదనపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, నంద్యాల.
బోధనాసుపత్రుల్లో: విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు
క్లినిక్‌లలో ఎలాంటి సేవలు?
► ఇతర జంతువుల కాట్లకు వైద్యం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్‌లు.
► యాంటీరేబిస్ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ స్నేక్ వీనం (పాము కాటు) మందు అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment