కుక్క మొరుగుతోందని వీరంగం సృష్టించిన వ్యక్తి...వీడియో వైరల్‌ | Delhi Man Annoyed With Barking Hits Dog And Neighbours Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: కుక్క మొరుగుతోందని వీరంగం సృష్టించిన వ్యక్తి...ముగ్గురికి గాయాలు

Published Mon, Jul 4 2022 4:16 PM | Last Updated on Mon, Jul 4 2022 7:25 PM

Delhi Man Annoyed With Barking Hits Dog And Neighbours Goes Viral - Sakshi

ఇటీవలకాలంలో వ్యక్తులకు చిన్న చిన్న విషయాలకే విసుగు, కోపం వచ్చేస్తోంది. కాస్త సహనం, ఓపికతో వ్యవహరించాలన్న ధోరణే లేకపోవడం బాధకరం. ఈ ఘోరమైన వైఖరితో వారికి వారే హాని చేసుకోవడమే కాకుండా పక్కవారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కేవలం కుక్క మెరిగిందని ఎంత దారుణంగానో ప్రవర్తించాడంటే...ఆ ఘటన చూసినవాళ్లకు సైతం అతడి వింత ప్రవర్తన చూసి ముక్కున వేలేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో ధరమ్‌వీర్ దహియా అనే వ్యక్తి తెల్లవారుజామున వాకింగ్‌ వెళ్తుండగా పొరుగింటి కుక్క మొరగడం మొదలుపెట్టింది. అది అతన్ని కొత్త వ్యక్తిగా భావించో లేక మరే కారణాల వల్ల తెలయదుగానీ అదేపనిగా అతన్ని చూసి మొరగడం ప్రారంభించింది. దీంతో అతను విసుగుచెంది ఆ కుక్కని తోకతో పట్టుకుని ఒకపక్కకి విసిరేశాడు. దీంతో సదరు కుక్క యజమాని రక్షిత్‌ దాన్ని రక్షించేందుకు రాబోతుండగా ఇంతలో అతడు కోపోద్రేకంతో రాడ్‌తో కుక్క పై దాడి చేశాడు.

దీంతో ఆ కుక్క అతడిని గట్టిగా కరిచింది. ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా సదరు కుక్క యజమాని రక్షిత్‌ని, అతడి భార్యను  కూడా రాడ్‌తో కొట్టాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికర్డు అయ్యింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘాతుకాని పాల్పడిన వ్యక్తితో సహా అందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement