Woman Pilot Husband Thrashed By Mob On Delhi Street, Video Viral - Sakshi
Sakshi News home page

Video: షాకింగ్‌.. ఢిల్లీ వీధుల్లో మహిళా పైలట్‌, భర్తను లాక్కొచ్చి, చితకబాది!

Jul 19 2023 3:35 PM | Updated on Jul 19 2023 4:54 PM

Video: Woman Pilot Husband Thrashed By Mob On Delhi Street - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. మహిళా పైలట్‌తోపాటు ఆమె భర్తపై కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై చితకబాదారు. 10 ఏళ్ల మైనర్‌ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డారు. పైలట్‌ యూనిఫాంలో ఉన్న మహిళ, ఆమె భర్తను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు.

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన షాకింగ్‌ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా పైలట్‌ దంపతులు గత రెండు నెలల క్రితం ఓ మైనర్‌ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతేగాక  ఆమెను వేధిస్తూ  దారుణంగా కొట్టేవారు. ఈ విషయం తాజాగా బాలిక బంధువుకు తెలియడంతో ఆమె మిగతా బంధువులను, ఇరుగుపొరుగు వారిని పైలట్‌ నివాసం వద్దకు తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారు.

గొడవ పెరిగడంతో మహిళ జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారు. ఆమె భర్తపై కూడా దాడి చేశారు. తనను క్షమించాలని మహిళా పైలట్‌ వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు.చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పైలట్‌ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మైనర్‌ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ముఖం, కళ్ల మీద దాడి చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన బంధువు ద్వారా ఉద్యోగంలో చేరిందని, ఆమె కూడా సమీపంలోని ఇంట్లో పని చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిందితురాలైన మహిళా ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు, తన భర్త మరో ప్రైవేటు విమానయాన సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 
చదవండి: తండ్రితో గొడవ.. పిల్లలను చంపడానికి కారుతో గుద్దించేశాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement