పనిమనిషిని అంత దారుణంగా.. | Woman Stripped and Beaten up for Helping Landlady | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 8:23 AM | Last Updated on Sat, Jun 30 2018 8:39 AM

Woman Stripped and Beaten up for Helping Landlady - Sakshi

వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం

యజమానికి సహకరించిందన్న కారణంతో ఓ మహిళపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆమె గుడ్డలూడదీసి అర్ధనగ్నంగా ఆమెను రోడ్డుపై పరుగులు పెట్టించారు. స్థానికులు కొందరు ఆ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయగా.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే...

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ పాలమ్‌ ప్రాంతంలో ఓ మహిళ తన కొడుకు-కోడలితో నివసించేంది. అయితే కోడలి వైఖరితో ఆ ఇంట్లో గొడవలు చెలరేగగా.. కొన్ని రోజుల క్రితం ఆ జంటను సదరు తల్లి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది. కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు. ఆమె దుస్తులు చించి, పిడి గుద్దులు గుప్పించారు. రోడ్ల వెంబడి పరుగులు పెట్టించారు. అడ్డుకోవటానికి యత్నించిన తల్లిపై కూడా దాడికి యత్నించారు. స్థానికులు చూస్తూ ఉండిపోయారే తప్ప(వీడియోలు మాత్రం తీశారు).. సాయానికి ముందుకు రాలేదు. చివరకు అక్కడి నుంచి పారిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతుల కోసం గాలింపు చేపట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement