helper
-
సన్నీ లియోన్ గొప్పమనసు .. రూ.50 వేల రివార్డ్ ప్రకటించిన నటి!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే రూ.50 వేల రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ సంబంధించిన వివరాలు షేర్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం. సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ చెబితే 11 వేల రూపాయలు పారితోషికం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రూ.50 వేల రివార్డ్ అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ.. సన్నీ లియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీలో కనిపించింది. ఇది చూసిన సన్నీ అభిమానులు.. దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సన్నీ లియోన్ మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళా పైలట్‌తోపాటు ఆమె భర్తపై కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై చితకబాదారు. 10 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డారు. పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళ, ఆమె భర్తను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా పైలట్ దంపతులు గత రెండు నెలల క్రితం ఓ మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతేగాక ఆమెను వేధిస్తూ దారుణంగా కొట్టేవారు. ఈ విషయం తాజాగా బాలిక బంధువుకు తెలియడంతో ఆమె మిగతా బంధువులను, ఇరుగుపొరుగు వారిని పైలట్ నివాసం వద్దకు తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగడంతో మహిళ జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారు. ఆమె భర్తపై కూడా దాడి చేశారు. తనను క్షమించాలని మహిళా పైలట్ వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు.చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పైలట్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ముఖం, కళ్ల మీద దాడి చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన బంధువు ద్వారా ఉద్యోగంలో చేరిందని, ఆమె కూడా సమీపంలోని ఇంట్లో పని చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిందితురాలైన మహిళా ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు, తన భర్త మరో ప్రైవేటు విమానయాన సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చదవండి: తండ్రితో గొడవ.. పిల్లలను చంపడానికి కారుతో గుద్దించేశాడు.. #WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her. The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z — ANI (@ANI) July 19, 2023 -
పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’
సత్తుపల్లి టౌన్ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు. అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే.. అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎంపికైనా పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక కుటుంబాన్ని వదిలి వెళ్లలేక.. నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా. - హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం సొంతూరిలో ఉండొచ్చని... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా. - నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఏర్పాట్లు చేస్తున్నాం.. శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం. - ఎం.విద్యాచందన, డీఆర్డీఓ శుభ పరిణామం.. ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి. - సీహెచ్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం -
వీధిలైట్లు బిగిస్తుండగా షాక్ గురైన హెల్పర్
-
సమయపాలన,క్రమశిక్షణలో జగన్‌ను మించినవారు లేరు
-
చిరు ఉపాయం.. తొలగిస్తుంది అపాయం
ముత్తారం: ఎంతటి అపాయాన్ని అయినా చిన్నపాటి ఉపాయంతో తొలగించుకోవచ్చునని, ఉపాయం ఉంటే ఊళ్లు ఏలచ్చని కవులు చెప్పినట్లు..విద్యుత్ స్తంభాలు ఎక్కే క్రమంలో జరిగే అపాయాలను చిరు ఉపాయంతో తప్పిస్తున్నాడు తాత్కాలిక విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న కుమార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిచ్చెన ఉపయోగించేవాడు. విద్యుత్ స్తంభం పై భాగానికి వెళ్లాలంటే కాళ్లతోనే ఎక్కాల్సిన పరిస్థితి. దీంతో పలుమార్లు జారిపడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం దొడ్డుకు సరిపడా ఇనుప రాడ్లతో క్లిప్స్ తయారు చేయించి, వాటిని చెప్పులకు బిగించాడు. కాళ్లకు చెప్పులు తొడుక్కొని ఇనుప రాడ్లు, క్లిప్పుల మధ్య విద్యుత్ స్తంభం ఉండడం వల్ల జారిపోకుండా ఉండి సునాయసంగా స్తంభాన్ని ఎక్కుస్తున్నాడు. ఉపాయం చిన్నదే అయిన్పటికీ ఎన్నో అపాయాల నుంచి కాపాడుతోందని కుమార్ చెప్తున్నాడు. కుమార్ పనితనాన్ని అందరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ హెల్పర్ మృతి
బొమ్మలరామారం, న్యూస్‌లైన్ :విద్యుదాఘాతంతో సబ్‌స్టేషన్ కాంట్రాక్ట్ హెల్పర్ మృతిచెందాడు. ఈ సంఘటన బొమ్మలరామారంలో ఆదివారం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్పురం గ్రామానికి చెందిన మోడిగోపు లక్ష్మీనారాయణ (45) 15 సంవత్సరాలుగా బొమ్మలరామారం సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన లక్ష్మీనారాయణ అర్ధరాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అతని సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే పలుమార్లు రింగ్ అయినా ఎత్తలేదు. దీంతో ఆందోళనకు గురై రాత్రి అంతా వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం కూడా వెతికారు. ఈ క్రమంలో మండలంలోని బండకాడిపల్లి శివారులో గల వ్యవసాయ భూమి వద్ద లక్ష్మీనారాయణ బైక్ కనిపించింది. సమీపంలో గల విద్యుత్ స్తంభం వద్ద అతని మృతదేహం పడి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్తంభంపై జంపర్ తెగిపోవడంతో దానిని సరిచేసే క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి లక్ష్మీనారాయణ మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం లక్ష్మీనారాయణ కుటుంబానికి పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. మృతుడి పిల్లల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను సైతం అందిస్తానని హామీ ఇచ్చారు.