
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే రూ.50 వేల రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ సంబంధించిన వివరాలు షేర్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం.
సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ చెబితే 11 వేల రూపాయలు పారితోషికం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
రూ.50 వేల రివార్డ్
అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ.. సన్నీ లియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీలో కనిపించింది. ఇది చూసిన సన్నీ అభిమానులు.. దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సన్నీ లియోన్ మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment