Man making threats to an employee: అమెరికాలోని ఒక నిందితుడిని అరెస్టు చేయడంతో ముగ్గురు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని అర్కాన్సాస్‌లోని క్రాఫోర్ట్ కౌంటీలో జరిగింది. అసలేం జరిగిందంటే....అర్కాన్సాస్‌లో కిరాణా స్టోర్‌లోని ఒక ఉద్యోగిపై ఒక అపరిచిత వ్యక్తి బెదిరింపుల పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే అధికారులు స్పదించారు. ఈ క్రమంలో ముగ్గురు అధికారులు సదరు దుకాణం వద్ద అపరిచిత వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతనిపై దాడి చేశారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక మహిళ రికార్డు చేస్తుండడంతో ఆమెను రికార్డు చేయొద్దు అంటూ అధికారులు బెదిరించారు కూడా. ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్రాఫోర్డ్ కౌంటీ మేయర్ జిమ్మి దమంటే ఈ ఘటన పై అధికారులను దర్యాప్తు చేయమని ఆదేశించడమే కాకుండా బాధ్యలైన సదరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆ ముగ్గురు అధికారుల్లో ఇద్దరు క్రాఫోర్డ్ కౌంటీ కార్యాలయంలోని డిప్యూటీలు కాగా, మూడవ వ్యక్తి మల్బరీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి అని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడుని అధికారులు రాండాల్ వోర్సెస్టర్‌గా గుర్తించారు. ఆ నిందితుడు స్టోర్‌లో పనిచేసే ఉద్యోగిపై ఉమ్మివేసి తల నరికేస్తానని బెదిరించాడని అన్నారు. తొలుత ముగ్గురు అధికారలు నెమ్మదిగా చెప్పి చూశారు, కానీ అతను వారిపై కూడా దాడి చేయడంతో అతనిని ఆపే క్రమంలో అధికారులు ఇలా ప్రవర్తించినట్లు వెల్లడించారు.
సదరు నిందితుడు వోర్సెస్టర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తదనంతరం అర్కాన్సాస్‌లోని వాన్ బ్యూరెన్‌లోని క్రాఫోర్డ్ కౌంటీ జైలుకి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై అర్కాన్సాస్ గవర్నర్ కూడా స్పందించడమే కాకుండా తక్షణమే విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
@4029news this was in Mulberry... pic.twitter.com/QHwrIeUfKw
— Sports&Sh!tPodcast™️ (@JosephPodcast) August 21, 2022
(చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?)
Comments
Please login to add a commentAdd a comment