Cops arrested
-
అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్
Man making threats to an employee: అమెరికాలోని ఒక నిందితుడిని అరెస్టు చేయడంతో ముగ్గురు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని అర్కాన్సాస్‌లోని క్రాఫోర్ట్ కౌంటీలో జరిగింది. అసలేం జరిగిందంటే....అర్కాన్సాస్లో కిరాణా స్టోర్‌లోని ఒక ఉద్యోగిపై ఒక అపరిచిత వ్యక్తి బెదిరింపుల పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే అధికారులు స్పదించారు. ఈ క్రమంలో ముగ్గురు అధికారులు సదరు దుకాణం వద్ద అపరిచిత వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక మహిళ రికార్డు చేస్తుండడంతో ఆమెను రికార్డు చేయొద్దు అంటూ అధికారులు బెదిరించారు కూడా. ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్రాఫోర్డ్ కౌంటీ మేయర్ జిమ్మి దమంటే ఈ ఘటన పై అధికారులను దర్యాప్తు చేయమని ఆదేశించడమే కాకుండా బాధ్యలైన సదరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ ముగ్గురు అధికారుల్లో ఇద్దరు క్రాఫోర్డ్ కౌంటీ కార్యాలయంలోని డిప్యూటీలు కాగా, మూడవ వ్యక్తి మల్బరీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అని చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడుని అధికారులు రాండాల్ వోర్సెస్టర్గా గుర్తించారు. ఆ నిందితుడు స్టోర్‌లో పనిచేసే ఉద్యోగిపై ఉమ్మివేసి తల నరికేస్తానని బెదిరించాడని అన్నారు. తొలుత ముగ్గురు అధికారలు నెమ్మదిగా చెప్పి చూశారు, కానీ అతను వారిపై కూడా దాడి చేయడంతో అతనిని ఆపే క్రమంలో అధికారులు ఇలా ప్రవర్తించినట్లు వెల్లడించారు. సదరు నిందితుడు వోర్సెస్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తదనంతరం అర్కాన్సాస్‌లోని వాన్ బ్యూరెన్లోని క్రాఫోర్డ్ కౌంటీ జైలుకి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై అర్కాన్సాస్ గవర్నర్ కూడా స్పందించడమే కాకుండా తక్షణమే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. @4029news this was in Mulberry... pic.twitter.com/QHwrIeUfKw — Sports&Sh!tPodcast™️ (@JosephPodcast) August 21, 2022 (చదవండి: భార్యలు రాజేసిన చిచ్చు.. పక్కనున్న పలకరింపుల్లేవ్!! ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?) -
నవజీవన్‌లో ఖాకీ రాబరీ..!
నెల్లూరు(క్రైమ్): నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నగదు దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రదారులైన ముగ్గురు కానిస్టేబుల్స్, అందుకు సహకరించిన ఆర్ఐను సోమవారం నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోపిడీ ఘటనలో కానిస్టేబుల్స్, ఆర్ఐ పాత్రను రైల్వే డీఎస్పీ డాక్టర్ జీ వసంతకుమార్ వెల్లడించారు. కావలి గాయత్రినగర్‌కు చెందిన అనిత అదే పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి మల్లికార్జునరావు వద్ద పనిచేస్తోంది. అనితకు కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రవితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతూ ఎలాగైనా బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. (చదవండి : పక్కా స్కెచ్ వేశారు.. నగదు కొట్టేశారు!) ఈ విషయాన్ని రవి తన సమీప బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్(ప్రస్తుతం విజయవాడ డీఆర్ఎఫ్లో పనిచేస్తున్న) మహేష్‌కు తెలియజేసి సహకరించాలని కోరారు. దీంతో మహేష్ తన స్నేహితులైన సహచర కానిస్టేబుల్స్ షేక్ సుల్తాన్‌బాషా, వీ సుమన్‌కుమార్‌తో చర్చించి సహకరించాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పీ మల్లికార్జునను కోరాడు. అందకు స్నేహితులు, అధికారి సమ్మతించారు. దోపిడీ సొమ్మును అందరం పంచుకుందామని నిర్ణయించుకుని అదను కోసం వేచిచూడసాగారు. సుల్తాన్‌బాషా, సునీల్‌కుమార్ నెల్లూరులోని ఓ లాడ్జిలో బసచేశారు. ఈ నెల 15న బంగారు వ్యాపారి మల్లికార్జున రూ.50లక్షలు అనితకు ఇచ్చి సీజన్బాయితో కలిసి చెన్నై వెళ్లి బంగారు బిస్కెట్లు తీసుకురావాలని సూచించాడు. దీంతో అనిత విషయాన్ని రవికి తెలియజేసింది. తనతో పాటు స్నేహితురాలు, సీజన్బాయి, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. మహేష్‌కు విషయాన్ని చేరవేసిన రవి అతని సూచనల మేరకు అదే రైలులో ఆమెను వెంబడిస్తూ బయలుదేరాడు. నెల్లూరు రైల్వేస్టేషన్లో సూల్తాన్బాషా, సుమన్‌కుమార్ రైలు ఎక్కుతారని, పథకం ప్రకారమే దోపిడీ చేస్తారని మహేష్ తెలిపాడు. రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఇద్దరు కానిస్టేబుల్స్ ఎక్కారు. రైలు గూడూరు సమీపిస్తుండగా ఎస్11 కోచ్‌లోకి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్స్ తాము రైల్వే పోలీసులమని చెక్ చేయాలని అనిత, ఆమె స్నేహితురాలి వద్ద ఉన్న నగదు బ్యాగులను తీసుకున్నారు. బ్యాగులను చెక్ చేస్తున్నట్లు నటిస్తూ వాటిని తీసుకుని గూడూరు రైల్వేస్టేషన్లో దిగి వెళ్లిపోయారు. అనంతరం అందరూ అదే రోజు రాత్రి బిట్రగుంట వద్దకు చేరుకుని నగదు పంచుకున్నారు. రవి, సదరు మహిళ రూ. 20లక్షలు తీసుకోగా, కానిస్టేబుళ్లు ముగ్గురు చెరో రూ 8లక్షలు తీసుకున్నారు. ఆర్ఐ రూ.6లక్షలు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అనిత నగదు దోపిడీ విషయాన్ని యజమానికి తెలియజేసింది. ఆయన సూచనల మేరకు దోపిడీ ఘటనపై గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ డాక్టర్ వసంతకుమార్, సీఐ దశరథరామయ్య తమ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటుచేసి కాల్‌డిటైల్స్, టవర్ లొకేషన్, రైల్వేస్టేషన్‌లోని సీసీఫుటేజ్‌ల ఆధారంగా విచారణ వేగవంతం చేయడంతో కేసులో చిక్కుముడి వీడింది. సూత్రదారులు ఎం రవి, అనితను ఈ నెల 25వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అదే కేసులో పాత్రదారులైన ఏపీఎస్పీ (ప్రస్తుతం డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్న) కానిస్టేబుల్స్ సీహెచ్ మహేష్, షేక్ సుల్తాన్‌బాషా, వీ సుమన్‌కుమార్, వారికి సహకరించిన ఆర్ఐ పీమల్లికార్జునరావును సోమవారం నెల్లూరు రైల్వే ఇన్స్పెక్టర్ జీ దశరథరామయ్య తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.30లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందన దోపిడీ కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన రూ.50లక్షలను రికవరీ చేసిన నెల్లూరు రైల్వే ఇన్స్పెక్టర్ జీ దశరథరామయ్య, ఎస్ఐలు బాలకృష్ణ, కోటయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ ప్రభాకర్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ లావణ్య, పీవీ సురేష్‌బాబు, సతీష్, ఆనంద్, పెంచలయ్య, రమేష్, తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఖాకీలు,ఆర్‌ఐలపై చర్యలకు సిఫార్సు ఆర్ఐ మల్లికార్జున ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాడు. మహేష్, సుల్తాన్‌బాషా, సునీల్‌కుమార్ నగదు దోపిడీ విషయం ముందుగానే ఆర్ఐ దృష్టికి తీసుకెళ్లారు. దోచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని ఇస్తామని ఆర్ఐతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆయన సిబ్బందికి అనుకూలంగా లీవ్‌లు ఇవ్వడంతో పాటు వారు విధుల్లో ఉన్నట్లు ఇలా పలు విధాలుగా సహకరించాడని రైల్వే డీఎస్పీ వసంతకుమార్ వెల్లడించారు. దోపిడీ కేసులో పాత్రదారులైన ఖాకీలు, వారికి సహకరించిన ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
యోగిని కలిసిన టెకీ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు
లక్నో : పోలీస్ కానిస్టేబుల్ చేతిలో హతమైన యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను సోమవారం కలుసుకున్నారు. తమకు అన్నివిధాలా సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉందని వివేక్ తివారీ భార్య కల్పనా తివారీ అన్నారు. తాము చెప్పింది సావధానంగా విన్న ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారని, ప్రభుత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రభుత్వంపై తమ నమ్మకం రెండింతలైందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపనందుకు ఆగ్రహంతో శనివారం లక్నోలోని గోమతీపూర్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ వివేక్ తివారీపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో తివారీతో ప్రయాణిస్తున్న కొలీగ్ సనా ఖాన్ ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.కాగా, బాధితుడి కుటుంబంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. -
సారిక కేసులో ఏ4గా సన
-
‘హెల్ప్‌లైన్’ ఎఫెక్ట్ చిక్కిన ఖాకీలు
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రారంభించి మూడురోజులైనా కాలేదు.. అప్పుడే ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడి న నేరానికి ఈ ఇద్దరూ కటకటాలపాలయ్యారు. వ్యాపారి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీరి ఆట కట్టించింది. నిందితులను ఈశ్వర్‌సింగ్, సందీప్కుమార్గా గుర్తించారు. వివరాల్లోకెళ్తే... జనక్‌పురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తు న్న ఈశ్వర్, సందీప్ ‘హఫ్తా’(బలవంతపు వసూళ్లు) ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారిని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆ వివరాలను అవినీతి నిరోధక విభాగానికి అందజేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈశ్వర్, సందీప్‌లను అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి రూ.3,000 తీసుకున్నట్లుగా తమ దర్యాప్తులో తేలిందని, గత వారం కూడా వీరిద్దరు ఇలాగే వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కూడా ధ్రువీకరించారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశామని, స్వెటర్ల వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా వారిపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయన్నారు. ఇదిలాఉండగా పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఓ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిందని, అయితే ప్రస్తుతం సదరు నిందితుడు పరారీలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్టు చేస్తామన్నారు. సులభంగా ఉండే హెల్ప్‌లైన్ నంబర్ 1031ను శుక్రవారం ప్రకటించామని, శనివారం 11,952 ఫిర్యాదులు అందాయని చెప్పారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని, 20 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.