Rod
-
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్‌తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్‌కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్‌కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
వైరల్ వీడియో : పాములా స్వింగ్ తిరుగుతున్న పిల్లి..!
-
రైల్లో ఘోర ప్రమాదం...సరాసరి మెడలోకి దిగిన రాడ్
ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్లోలో విండో సీటులో కూర్చొన్న వ్యక్తి కూర్చొన్నట్లుగానే చనిపోయాడు. అనుహ్యంగా ఒక ఇనుపరాడ్ కిటికి అద్దాలను పగలుగొట్టుకుంటూ వచ్చి సరాసరి విండోసీటు వద్ద కూర్చొన్న వ్యక్తి మెడలోకి దిగిపోయింది. దీంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో అలా కూర్చొనే మృతి చెందాడు. ప్రయాగ్‌రాజ్ డివిజన్ వద్ద ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో రైలుని అలీఘర్ జంక్షన్ వద్ద నిలిపేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు హరికేష్ కుమార్ దూబేగా గుర్తించారు. రైల్వే ట్రాక్ పనుల్లో వినియోగించే ఇనుపరాడ్ కిటికి అద్దాలు పగలిపోయాలా లోపలికి దూసుకొచ్చి కిటికి వద్ద కూర్చొన్న హరికేష్ దూబే మెడకు గుర్చుకుందని చెప్పారు పోలీసులు. ఉత్తర మధ్య రైల్వే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. (చదవండి: సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్‌నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు) -
కుక్క మొరుగుతోందని వీరంగం సృష్టించిన వ్యక్తి...వీడియో వైరల్
ఇటీవలకాలంలో వ్యక్తులకు చిన్న చిన్న విషయాలకే విసుగు, కోపం వచ్చేస్తోంది. కాస్త సహనం, ఓపికతో వ్యవహరించాలన్న ధోరణే లేకపోవడం బాధకరం. ఈ ఘోరమైన వైఖరితో వారికి వారే హాని చేసుకోవడమే కాకుండా పక్కవారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కేవలం కుక్క మెరిగిందని ఎంత దారుణంగానో ప్రవర్తించాడంటే...ఆ ఘటన చూసినవాళ్లకు సైతం అతడి వింత ప్రవర్తన చూసి ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో ధరమ్వీర్ దహియా అనే వ్యక్తి తెల్లవారుజామున వాకింగ్ వెళ్తుండగా పొరుగింటి కుక్క మొరగడం మొదలుపెట్టింది. అది అతన్ని కొత్త వ్యక్తిగా భావించో లేక మరే కారణాల వల్ల తెలయదుగానీ అదేపనిగా అతన్ని చూసి మొరగడం ప్రారంభించింది. దీంతో అతను విసుగుచెంది ఆ కుక్కని తోకతో పట్టుకుని ఒకపక్కకి విసిరేశాడు. దీంతో సదరు కుక్క యజమాని రక్షిత్ దాన్ని రక్షించేందుకు రాబోతుండగా ఇంతలో అతడు కోపోద్రేకంతో రాడ్‌తో కుక్క పై దాడి చేశాడు. దీంతో ఆ కుక్క అతడిని గట్టిగా కరిచింది. ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా సదరు కుక్క యజమాని రక్షిత్‌ని, అతడి భార్యను కూడా రాడ్‌తో కొట్టాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికర్డు అయ్యింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘాతుకాని పాల్పడిన వ్యక్తితో సహా అందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. #WATCH | Delhi: 3 members of a family&their pet dog injured after being hit by a neighbor with an iron rod in Paschim Vihar. It happened after the dog allegedly barked at him. FIR lodged. Injured stable. Dog's owner says it has a clot in its head & will be taken to veterinarian. pic.twitter.com/YAa1QdduzB — ANI (@ANI) July 4, 2022 -
నిర్భయ కేసులో 'ఐరన్ రాడ్ థియరీ' నిరూపిస్తే 10 లక్షలిస్తా..!!
న్యూఢిల్లీః నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో ఢిఫెన్స్ లాయర్ కొత్త వాదనకు తెరతీశారు. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు. కేసులో ఐరన్ రాడ్ థియరీని నిరూపిస్తే 10 లక్షలిస్తానంటూ బహుమతిని ప్రకటించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను దించి, అవయవాలను బయటకు లాగారన్న పోలీసుల వాదదను ఆయన కొట్టిపారేశారు. అదో కట్టు కథ అని, అది నిరూపిస్తే పదిలక్షలు ఇస్తానంటూ న్యాయవాది శర్మ ప్రకటించడం.. కేసు మరో ట్విస్ట్ గా మారింది. 2012 లో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రపంచదేశాలను కుదిపేసిన నిర్భయ ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సుప్రీంలో చివరి దశలో ఉండగా... విచారణలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ళ ట్రైనీ ఫిజియోథెరపిస్ట్.. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరంలోకి ఇనుపరాడ్ ను గుచ్చి, అవయవాలను బయటకు లాగారని, తీవ్రమైన గాయాలు అవ్వడంతోనే అనంతరం ఆమె మరణించినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది. దీంతో దోషులు సుప్రీంను ఆశ్రయించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మరొక నిందితుడు.. జువైనల్ కావడంతో మూడేళ్ల పాటు రిఫామ్ హోమ్ లో ఉంచి, అనంతరం విడుదల చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసుపై విచారణ జరిగిన అనంతరం.. దోషుల తరపు న్యాయవాది కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టులో దోషుల తరపున వాదించిన అనంతరం బయటకు వచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ.. ఇనుప రాడ్ థియరీని నిరూపించినవారికి 10 లక్షల బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. బాధితురాలు అత్యాచారం అనంతరం ఆసుపత్రిలో పూర్తి స్పృహలో ఉండగానే వాంగ్మూలం ఇచ్చిందని... ఆమె గానీ, ఆమె స్నేహితుడుగానీ ఇనుపరాడ్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోలీసులే ఈ కట్టుకథను అల్లినట్లుగా ఆయన ఆరోపించారు. బాధితురాలు చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి ఇచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి యుటెరస్ గానీ, ఓవరీస్ గానీ డ్యామేజ్ అయినట్లు ఎక్కడా లేదని న్యాయవాది శర్మ వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుపరాడ్ ప్రస్తావన లేకున్నా.. పోలీసుల వాదన ఎలా చేరుస్తారని శర్మ ప్రశ్నించారు. నిర్భయ కేసు నిందితుల్లో ముఖేశ్, పవన్ ల తరపున శర్మ.. సుప్రీంలో వాదనలు వినిపించారు. -
'మెట్రో' రాడ్ మీద పడి టెకీ మృతి
చెన్నై: చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రోస్టేషన్ లోని ఇనుప రాడ్ మీదపడటంతో టెకీ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. చెన్నైలో రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం ఎనిమిది గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఐటి కంపెనీలో పనిచేసే మాదిపక్కం ఏరియాకు చెందిన గిరిధర్ (30) ఉదయం తన బైక్ పై ఆఫీసుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి పది అడుగుల ఇనుప రాడ్ అతనిపై పడి బలంగా తాకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. కాగా, గత మూడేళ్లలో ఈ తరహా ప్రమాదాల్లో నలుగురు చనిపోయినట్టు సమాచారం.