![Man Died Iron Rod Pierces Through His Neck On Window Seat At Train - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/2/man.jpg.webp?itok=5jXju5Fv)
ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్లోలో విండో సీటులో కూర్చొన్న వ్యక్తి కూర్చొన్నట్లుగానే చనిపోయాడు. అనుహ్యంగా ఒక ఇనుపరాడ్ కిటికి అద్దాలను పగలుగొట్టుకుంటూ వచ్చి సరాసరి విండోసీటు వద్ద కూర్చొన్న వ్యక్తి మెడలోకి దిగిపోయింది. దీంతో ఆ వ్యక్తి రక్తపు మడుగులో అలా కూర్చొనే మృతి చెందాడు.
ప్రయాగ్‌రాజ్ డివిజన్ వద్ద ఉదయం 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. దీంతో రైలుని అలీఘర్ జంక్షన్ వద్ద నిలిపేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడు హరికేష్ కుమార్ దూబేగా గుర్తించారు. రైల్వే ట్రాక్ పనుల్లో వినియోగించే ఇనుపరాడ్ కిటికి అద్దాలు పగలిపోయాలా లోపలికి దూసుకొచ్చి కిటికి వద్ద కూర్చొన్న హరికేష్ దూబే మెడకు గుర్చుకుందని చెప్పారు పోలీసులు. ఉత్తర మధ్య రైల్వే ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది.
(చదవండి: సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్‌నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment