
సాక్షి, జగిత్యాల : ‘ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్’ కార్మిక సంఘ మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి నియమితులయ్యారు. ఆయనను జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తూ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సోమవారం నియామకపత్రాన్ని విడుదల చేశారు. ‘‘ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల మీకు ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్‌లో సభ్యుడిగా చేరి పనిచేయాలనే మీ ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి మిమ్మల్ని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తున్నాను. ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం.. బ్రతుకుదెరువు కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు.
సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, ప్రభుత్వ సంస్థలు మీ ప్రాంతంలో నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలు విజయవంత చేయాలి. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల చట్టం,1926 ప్రకారం రిజిస్టర్ చేయబడిన సంస్థ. మీరు నిబంధనల ప్రకారం, యూనియన్ కార్యవర్గ తీర్మానాల ప్రకారం, సూచనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. సేవా కార్యక్రమాలను నిర్వహించడం, పాల్గొనడం మాత్రమే’’ అని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment