labour union
-
పీఎంఎల్‌యూ గొల్లపల్లి మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి
సాక్షి, జగిత్యాల : ‘ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్’ కార్మిక సంఘ మండల వాలంటీర్‌గా మాటేటి స్వామి నియమితులయ్యారు. ఆయనను జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తూ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సోమవారం నియామకపత్రాన్ని విడుదల చేశారు. ‘‘ వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల మీకు ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్‌లో సభ్యుడిగా చేరి పనిచేయాలనే మీ ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి మిమ్మల్ని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వాలంటీర్‌గా నియమిస్తున్నాను. ప్రజలు ఉద్యోగం, ఉపాధి కోసం.. బ్రతుకుదెరువు కోసం అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్, ప్రభుత్వ సంస్థలు మీ ప్రాంతంలో నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలు విజయవంత చేయాలి. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘం భారత కార్మిక సంఘాల చట్టం,1926 ప్రకారం రిజిస్టర్ చేయబడిన సంస్థ. మీరు నిబంధనల ప్రకారం, యూనియన్ కార్యవర్గ తీర్మానాల ప్రకారం, సూచనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. సేవా కార్యక్రమాలను నిర్వహించడం, పాల్గొనడం మాత్రమే’’ అని స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు. -
‘కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
అనంతపురం సప్తగిరి సర్కిల్ : పరిగి మండలం పైడేటీ గ్రామ సమీపంలోని ఎస్ఏ రావతార్ మసాలా ఫ్యాక్టరీలో తొలగించిన 183 కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కారిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో సీఐటీయు, ఏఐటీయూసీ, వైఎస్సార్‌టీయూ ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు చేపట్టాల్సిన కార్యచరణ గురించి వారు చర్చించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శి వెంకటేష్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వెంకటనారాయణ, ఏఐయూటీయూసీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేశోరాం’తో ప్రత్యక్ష పోరాటం
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని, కార్మికుల సమస్యల సాధనకై కంపెనీతో ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నామని కంపెనీ పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం బసంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై డిమాండ్ నోటీస్ అందజేసి ఏడాది గడుస్తున్నా ఒక్క సమస్యను యాజమాన్యం పరిష్కరించలేదన్నారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తమ ఆలోచనను యాజమాన్యం బేఖాతరు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. దీనిపై కార్మికులతో కలిసి సమైక్యంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీల్లో యూనియన్ కార్యాలయాలు ఉన్నాయని, కేవలం ఒక్క కేశోరాంలోనే యూనియన్ కార్యాలయం లేదని, దీని నిర్మాణానికి యాజమాన్యం పూర్తిగా సహకరించడం లేదన్నారు. తాము స్వంత ఖర్చులతో యూనియన్ భవనాన్ని నిర్మించనున్నామని, దీనిలో భాగంగా భవన నిర్మాణానికి అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డికి దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. ఈసమావేశంలో కార్మిక సంఘం కార్యదర్శిలు ముల్కల కొంరయ్య, గద్వాల నగేష్‌లు పాల్గొన్నారు. -
ఎస్‌సీఎల్‌యూ భవితవ్యమేమిటి ?
టీబీజీకేఎస్‌లో విలీనమా..కలిసి పనిచేయడమా..! అయోమయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా నియూమకం కావడంతో ఎస్‌సీఎల్‌యూ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం క్రితం గోదావరిఖనిలో జరిగిన యూనియన్ సమావేశంలో టీబీజీకేఎస్‌తో కలిసి పనిచేయడానికి వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తనతో కలిసి వచ్చే నాయకులతో సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన వెంట వెళ్లే నాయకులెందరనేది సంశయంగా మారింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు వ్యవహరిస్తున్నందున ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎస్సీఎల్యూను అందులో విలీనం చేయూలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ భవిష్యత్‌లో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చినా.. తిరిగి ఎస్‌సీఎల్‌యూ ద్వారా సింగరేణి లో కార్యకలాపాలు నిర్వహించేందుకు కలిసి పనిచేయా లా? అనే మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం. బలోపేతం కానున్న ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ సింగరేణిలో నిన్నటి వరకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి సింగరేణిలో రెండు యూనియన్లు పనిచేశాయి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్‌సీఎల్‌యూ, జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ) కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే వెంకట్రావు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెళ్లడంతో ఎస్సీఎల్యూలో కొనసాగే క్యాడర్, కాంగ్రెస్ అభిమానులు సహజంగా ఎస్సీఎస్డబ్ల్యూయూకే మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం ఎస్‌సీఎల్‌యూ వర్కింగ్ కమిటీలో 63 మంది సభ్యులుండగా అందులో 43 మంది జనక్‌ప్రసాద్ యూనియన్‌లో చేరడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒకే యూనియన్ సింగరేణిలో పనిచేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 1998లో జరిగిన మొదటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ‘సాజక్’ పేరుతో పోటీచేసి ఆర్జీ-1, 2 డివిజన్లను గెలుచుకుంది. తర్వాత 2007 ఎన్నికల్లో వెంకట్రావుతో కలిసి పనిచేసి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించడానికి సంజీవరెడ్డి సూచన మేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో గోదావరిఖనిలో జరి గిన ఐఎన్టీయూసీ మహాసభల్లో పాల్గొన్న యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఒకే యూనియన్ ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతుండడంతో యూని యన్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. మిర్యాల’తో మంతనాలు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిర్యా ల రాజిరెడ్డిని యూనియన్‌లో స్థానం లేకుండా చేయడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌లో చేర్చుకునేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్సీసీడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, బడికెల రాజలిం గం, గుమ్మడి కుమారస్వామి తదితర నాయకులు మిర్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి సెంటినరీకాలనీలోని నివాసంలో రాజిరెడ్డిని కలిసి యూనియన్‌లోకి రావాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని యూని యన్ నుంచి తొలగించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు సమావేశమై టీబీజీకేఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ యూనియన్, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు
* కేంద్రం తీరుపై కార్మికసంఘాల ధ్వజం * ఇందిరాపార్కు వద్ద ధర్నా, భారీ ర్యాలీ హైదరాబాద్: పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్లుగా ఉందని కార్మికసంఘాల నేతలు ఆరోపించారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరించేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కార్మికసంఘాల నేతలు మాట్లాడుతూ... పారిశ్రామిక వేత్తలకు, పాలకులకు మధ్య రహస్య ఒప్పందాలు జరగుతున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్రం తిలోదకాలిస్తోందని, అందులో భాగంగానే కార్మిక చట్టాల్లో సవరణకు పాల్పడుతోందని విమర్శించారు. కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులు హక్కుల ఉల్లంఘనకు, తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావులు ప్రసంగించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశం, ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ సుధీర్, ఐఎఫ్టీయూ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర రావు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే బోస్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రామయ్య తదితరులు పాల్గొన్నారు.