అనంతపురం సప్తగిరి సర్కిల్ : పరిగి మండలం పైడేటీ గ్రామ సమీపంలోని ఎస్‌ఏ రావతార్ మసాలా ఫ్యాక్టరీలో తొలగించిన 183 కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని కారిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో సీఐటీయు, ఏఐటీయూసీ, వైఎస్సార్‌టీయూ ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు చేపట్టాల్సిన కార్యచరణ గురించి వారు చర్చించారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శి వెంకటేష్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వెంకటనారాయణ, ఏఐయూటీయూసీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
Published Sat, Sep 3 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
Advertisement
Advertisement