రాళ్ల క్వారీలో కూలిన బతుకులు | Mizoram Stone Quarry Collapse Bihar Labourers Killed | Sakshi
Sakshi News home page

రాళ్ల క్వారీలో కూలిన బతుకులు.. బీహారీ కూలీల సజీవ సమాధి

Published Tue, Nov 15 2022 9:06 AM | Last Updated on Tue, Nov 15 2022 9:31 AM

Mizoram Stone Quarry Collapse Bihar Labourers Killed - Sakshi

ఐజ్వాల్‌: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్ల క్వారీ కుప్పకూలిన ఘటనలో.. కడపటి వార్తలు అందేసరికి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాళ్ల కింద చిక్కుకున్న మరికొందరు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

న‌య్‌థియాల్ జిల్లాలోని మౌద‌ర్హ్ అనే గ్రామంలో ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాళ్ల క్వారీలో ప్రమాదం జరిగింది.  ఈ క్వారీలో రెండున్న‌ర ఏళ్లుగా ప‌నులు జ‌రుగుతున్నాయి. మృతులంతా బీహారీ కూలీలని అధికారులు ప్రకటించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. 

సోమవారమే ఈ రాళ్ల క్వారీ కూలిపోయింది. కార్మికులు మ‌ధ్యాహ్న భోజ‌న అనంతరం పనుల్లో మునిగిపోగా.. ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కూలీలలో 12 మందితో పాటు హిటాచి డ్రైవ‌ర్లు క్వారీ లోప‌ల చిక్కుకుపోయినట్లు సమాచారం. వాళ్ల‌ను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. 

ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు చుట్టుప‌క్కల గ్రామాల నుంచి వ‌లంటీర్లు త‌ర‌లివ‌చ్చారు. రాష్ట్ర విప‌త్తు నివార‌ణ బృందాలతో పాటు స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement