పాట్నా: బిహార్‌లో వరుసగా బబ్రిడ్జిలు కూలిపోవడంపై కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంతెనలు వరుసగా కూలిపోవడం వెనుక ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న కుట్ర ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
‘రెండు నెలల క్రితం బ్రిడ్జిలన్నీ సరిగానే ఉన్నాయి. ఇప్పుడేమో వరుసపెట్టి కూలిపోతున్నాయి. ప్రభుత్వాన్ని అవమానించేందుకు కొంత మంది కావాలనే ఇది చేస్తున్నారని అనుమానం వస్తోంది.
వంతెనలు కూలిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నాకు సమాచారం ఉంది’అని మాంజీ అన్నారు. గడిచిన 10 రోజుల్లో బిహార్‌లో వరుసపెట్టి బ్రిడ్జిలు కూలిపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment